Goddess Lakshmi: ఆర్థిక సమస్యలు ఉన్నాయా.. అయితే ఇంట్లో ఈ మొక్క నాటండి!
ఇంటి ఆవరణలో ఇంటిదగ్గర మొక్కలను పెంచడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా పరిశుభ్రమైన గాలి కూడా వస్తుంది.
- Author : Anshu
Date : 01-07-2022 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంటి ఆవరణలో ఇంటిదగ్గర మొక్కలను పెంచడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా పరిశుభ్రమైన గాలి కూడా వస్తుంది. అయితే చాలా మంది ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. పురాణాల ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం హిందూ మతంలో తన పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి మొక్కల్లో లక్ష్మణ మొక్క కూడా ఒకటి. అయితే ఈ లక్ష్మణ మొక్కను జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది.
ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు తిండికి లోటు ఉండదు. ఈ లక్ష్మణ మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతూ ప్రతికూల శక్తి దూరమవుతుంది. అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ లక్ష్మణ మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. సంపదను కూడా ఇస్తుంది అని నమ్మకం. ఈ మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరడమే కాకుండా, డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల ప్రతి పని విజయం సాధించడంతోపాటు అదేం కూడా పెరుగుతుందట.
ఆదాయానికి అనేక మార్గాలు ఏర్పడటంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందట. మన ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఈ లక్ష్మణ మొక్కను నాటాలి. ఈ రెండు దిశలు సంపదకు కారకంగా పరిగణించబడతాయి. ఈ దిశలో మొక్కలు నాటడం వల్ల సంపదలు చేకూరతాయని తోపాటుగా మనకు రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతాయట.