Maha Shivalayam : ఏడాదిలో 27 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Maha Shivalayam : ఈ ఆలయం కన్నూర్ పట్టణానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవుల్లో, నదీ తీరం వద్ద వుంటుంది. ఇది కేవలం ఏడాదిలో ఒక్కసారి, 27 రోజుల పాటు మాత్రమే తెరుస్తారు
- By Sudheer Published Date - 04:54 PM, Wed - 18 June 25

కేరళ (North Kerala) రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా సమీపంలో ఉన్న కొట్టియూర్ మహా శివాలయం (Kottiyoor Maha Siva Temple) ఒక అపురూప దేవస్థానంగా నిలుస్తోంది. ఈ ఆలయం కన్నూర్ పట్టణానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవుల్లో, నదీ తీరం వద్ద వుంటుంది. ఇది కేవలం ఏడాదిలో ఒక్కసారి, 27 రోజుల పాటు మాత్రమే తెరుస్తారు. ఈ ప్రత్యేక సమయం వైశాఖ మాసంలో నిర్వహించే వైశాఖ మహోత్సవం సందర్భంగా జరుగుతుంది. 2025లో ఈ ఆలయం జూన్ 8 నుంచి జులై 4 వరకు భక్తులకు దర్శనమివ్వనుంది.
Telangana : ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి
ఈ ఆలయం విశిష్టత చూస్తే.. ఇక్కడ శాశ్వత కట్టడం కాదు. ఏటా గుడిసె తరహాలో పూరి తాటి ఇళ్లతో ఆలయ నిర్మాణం జరిపి, ఉత్సవం ముగిసిన తర్వాత వాటిని పునః నిర్మించేందుకు తిరిగి తొలగిస్తారు. నదీ ప్రవాహానికి మధ్య ఉన్న ఈ ఆలయం చుట్టూ గ్రీనరీ, శాంతత్మక వాతావరణం భక్తులను ఆకర్షిస్తుంది. ప్రకృతితో మమేకమైన తీర్థక్షేత్రంగా కొట్టియూర్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు, పూజలు కేవలం స్థానిక పండుగలకే పరిమితం కాకుండా, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తాయి. మహాదేవుని పట్ల భక్తి గల వారు ఈ 27 రోజుల్లో తప్పకుండా అక్కడికి వెళ్లి దైవదర్శనం పొందాలని భావిస్తారు. ఈ ఆలయ విశేషాలు, ప్రత్యేకతలతో కూడిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొట్టియూర్ శివాలయం ఇప్పుడు కేవలం ఓ ఆలయంగా కాక, ప్రకృతి మాధుర్యాన్ని ఆస్వాదించదగిన పవిత్ర ప్రదేశంగా నిలుస్తోంది.