Bottu: ఆ వేలుతో బొట్టు పెట్టుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకునే విషయంలో ఎన్నో రకాల విషయాలను చెప్పబడ్డాయి. బొట్టు పెట్టుకునే విషయంలో అలాగే ఇతరులకు బొట్టు
- By Anshu Published Date - 09:00 PM, Fri - 4 August 23

హిందూ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకునే విషయంలో ఎన్నో రకాల విషయాలను చెప్పబడ్డాయి. బొట్టు పెట్టుకునే విషయంలో అలాగే ఇతరులకు బొట్టు పెట్టే విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ బొట్టు పెట్టుకోవడం విషయంలో స్త్రీలు చాలామంది చిన్న చిన్న పొరపాటులను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి, ఇతరులకు ఏ వేలుతో బొట్టును పెట్టాలి అన్న విషయాలు చాలా మందికి తెలియవు. ముఖంపై బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. అందమైన ముఖానికి బొట్టు మరింత అందాన్ని ఇస్తుందని కూడా చెప్పవచ్చు.
అయితే బొట్టు ముఖానికి అందాన్ని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని మనలో చాలామందికి తెలియదు. ఎక్కువగా గమనిస్తే స్త్రీలు కుంకుమ తో బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ సాంప్రదాయ ప్రకారం మనం పెట్టుకునే బొట్టుకు ఒక ప్రత్యేకత అంటూ ఉంది. మహిళలు బొట్టును ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లి అయిన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టును పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడానికి వీలులేని మహిళలు శుభ కార్యాలు చేయడానికి అర్హులుకారని భావిస్తారు. ఎవరైనా ముత్తయిదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవించడం మన హిందూ సంప్రదాయం.
అదే విధంగా ఏదైనా శుభకార్యాలకు ఆహ్వానించే సమయంలో వారికి మర్యాదపూర్వకంగా బొట్టుపెట్టి పిలవడం జరుగుతుంది. ఇది మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ. మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే వారు సుమంగళిగా ఉంటారు. అంతా శుభమే జరుగుతుంది. బొట్టు ఒక్కొక్కరు ఒక్కో వేలితో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి కలుగుతుందని, మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుందని, చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని, బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని హిందూ సాంప్రదాయం చెబుతోంది. నుదటి భాగాన్ని బ్రహ్మ స్థానంగా భావిస్తారు.
నుదుటన బొట్టు పెట్టుకుంటే బ్రహ్మను పూజించినట్లు అవుతుందని భావించి కనుబొమ్మల మధ్య భాగంలో బొట్టు పెట్టుకుంటారు. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. కాబట్టి బ్రహ్మ స్థానం అయిన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే బొట్టు అంటే ఎరుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎరుపు రంగు మనుషుల ఆత్మజ్యోతి స్వరూపమని బావిస్తారు. కాబట్టి ఎక్కువగా మహిళలు ఎరుపురంగును బొట్టుగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. నుదుట పెట్టుకున్న కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. కనుబొమ్మల మధ్య ఉండే సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. నుదుటన పెట్టుకున్న బొట్టు వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. శక్తిని కోల్పోకుండా కాపాడుతుంది.