Spirtual: గుమ్మం దగ్గర ఇవి ఉంచితే చాలు.. ఎలాంటి దరిద్రం అయినా సరే పారిపోవాల్సిందే!
Spirtual: మన ఇంట్లోని గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పినట్టు చేస్తే చాలు ఎలాంటి దరిద్రం అయినా సరే పారిపోవాల్సిందే అని, మీకు మంచి రోజులు మొదలవుతాయి అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 06:00 AM, Sun - 16 November 25
Spirtual: మామూలుగా వాస్తు శాస్త్ర ప్రకారం అలాగే ఆధ్యాత్మిక పండితులు చెప్పినట్టుగా కొన్ని విషయాలను పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో గుమ్మం దగ్గర కొన్ని రకాల వస్తువులను చెట్లను ఉంచడం కూడా ఒకటి. ముఖ్యంగా గుమ్మం వద్ద కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఆ ఇంట్లోనే వారు సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇకపోతే దరిద్రం తాండవిస్తోంది, ఏ పని మొదలుపెట్టిన కూడా కలిసి రావడం లేదు అనుకున్న వారు గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పినట్టు చేస్తే చాలు అని చెబుతున్నారు పండితులు.
మరి అందుకోసం గుమ్మం దగ్గర ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబు ఉంచాలి. ఆ రాగి చెంబులో నీరు పోసి కాస్త పచ్చ కర్పూరం అలాగే అందులో ఐదు రూపాయి బిళ్ళలు వేయాలి. అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే వట్టివేళ్ళు అందులో ఉంచాలి. ఇలా ఉంచిన ఆ రాగి చెంబును గుమ్మానికి లోపలి వైపున గుమ్మం పక్కన ఉంచాలి. ఇలా ప్రతిరోజు అందులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి. అలాగే పచ్చ కర్పూరం, ఎరుపు రంగు పుష్పం, వట్టివేళ్లను కూడా మారుస్తూ ఉండాలి.
ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని చెబుతున్నారు. దరిద్ర దేవత ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. అలాగే గుమ్మానికి బయట వైపు దీపాలని పెట్టాలని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో, గుమ్మానికి బయట దీపాలను పెడతారో ఆ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నిలబడదని చెబుతున్నారు. దరిద్ర దేవత వెళ్లిపోగానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు.