Vastu Tips: ఈశాన్యంలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
ఇంట్లోని ఈశాన్య దిశలో ఒక వస్తువు ఉంచడం వల్ల విష్ణువు అనుగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:19 PM, Thu - 1 August 24

మామూలుగా చాలామంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇంట్లో ఉండే వస్తువులను కూడా వాస్తు ప్రకారంగా అమర్చుకుంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దిశలో శంఖం ఏర్పాటు చేసుకుంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. శంఖం అంటే విష్ణువుకు ప్రతీక ఈ దిశలో పెట్టుకుంటే ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయట. సాధారణంగా ఈశాన్య దిశలో పూజగదిని ఏర్పాటు చేసుకుంటారు.
అయితే అక్కడే శంఖం కూడా ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. సుఖశాంతులు కూడా లభిస్తాయట. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశ ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉండాలని చెబుతున్నారు పండితులు. ఈ దిశలో పూజలు చేస్తాం కాబట్టి, తడిగా కాకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయట. అయితే ఈశాన్య దిశలో శంఖం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందట. ఇంట్లో ఉన్న నెగిటివిటీ తగ్గిపోయి సానుకూల శక్తి వస్తుందని చెబుతున్నారు పండితులు.
అదేవిధంగా శంఖాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఈశాన్య దిశ అంటేనే సంపదకు చిహ్నం. ఈ దిశలో ఏర్పాటు చేసిన శంఖం ఊదడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి ఒత్తిడి కూడా తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ఈశాన్య దిశలో శంఖం పెట్టుకోవడంతో పాటు తరచూ పూజలు చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగిపోతాయని పండితులు చెబుతున్నారు.
note: పైన ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.