Lakhmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లో పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మన పూజా మందిరంలో తప్పకుండా కొన్ని వస్తువులు ఉంచుకోవాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Mon - 7 October 24

హిందువులు ఎక్కువ శాతం మంది కొలిచే దేవుళ్లలో లక్ష్మీదేవి కూడా ఒకరు. లక్ష్మీదేవిని సనాతన ధర్మం లో సంపదకు అది దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావని కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందితే ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదని భావిస్తూ ఉంటారు. అయితే లక్ష్మి అనుగ్రహం కావాలి అనుకున్న వారు మన ఇంట్లోని పూజ మందిరంలో కొన్ని వస్తువులను పెట్టాలట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెమలి ఈకలను మీ ఇంట్లోని గుడిలో పెట్టాలట.
ఎందుకంటే దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చట. అలాగే మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయట. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలట. అదేవిధంగా మీ ఇంట్లోని పూజ మందిరంలో గంగా జలం ఉంచడం మంచిది. ఎందుకంటే హిందూమతంలో గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగాజలాన్ని మీ ఇంటి గుడిలో పెట్టాలి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందట. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణ శంఖాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటప్పుడు ఈ శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటి గుడిలో పెట్టవచ్చట.
దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చట. శివలింగం శివునికి చిహ్నం. అందుకే మీ ఇంటి గుడిలో ఒక శివలింగాన్ని తప్పకుండా పెట్టాలట. అలాగే క్రమం తప్పకుండా శివలింగాన్ని ఆరాధించాలట. శివలింగానికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతున్నారు. హిందూ మతంలో మొదట పూజించే దేవుడు వినాయకుడు. అందుకే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటి గుడిలో తప్పకుండా ఉంచాలట. విగ్రహం ముఖం ఉత్తర దిశ వైపు ఉండాలని గుర్తుంచుకోవాలట.