Shanidev: శనిదేవుడి పూజలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
శనిదేవుడికి పూజ చేసేవారు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Wed - 7 August 24

హిందూమతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి మనకు మంచి చెడు ఫలితాలను అందిస్తాడని చెబుతుంటారు. అయితే ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే ఆయన ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి. రాత్రికి రాత్రి కోటీశ్వరులు బీదవారిగా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి అలాంటి శని పూజలో పొరపాటున కూడా కొన్ని తప్పులు అసలు చేయకూడదని చెబుతున్నారు. అయితే శని దేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి.
లేకుంటే శని భగవానుడి ఆగ్రహానికి గురవ్వక తప్పదని అంటున్నారు పండితులు. మీరు ప్రతి వారం శనివారాలలో శని దేవుడిని క్రమం తప్పకుండా పూజిస్తుంటే, కొన్ని తప్పులు చేయకూడదు. ఇంతకీ ఆ తప్పులు ఏమిటి అన్న విషయానికి వస్తే.. గుడికి వెళ్లి శనిదేవుడిని పూజించేటప్పుడు శనీశ్వరుని కళ్లలోకి చూస్తూ నిటారుగా నిలబడి పూజించకూడదు. మీ కళ్ళు మూసుకుని లేదా అతని పాదాలను చూస్తూ ఎల్లప్పుడూ శని దేవుడిని ఆరాధించాలి. శని భగవానుని కళ్లలోకి చూస్తూ, పూజించడం ద్వారా, శని భగవానుడి దృష్టి నేరుగా మీపై పడుతుందట.
అలాగే శని దేవుడిని పూజించిన తర్వాత, ఎల్లప్పుడూ మీ వెన్ను చూపకూడదు.
మీరు శనిదేవుడిని ఎలా పూజించారో అదే స్థితికి తిరిగి వెళ్లాలి అనేది అపోహ. శనీశ్వరుని పూజించిన తర్వాత వీపు చూపిస్తే శనీశ్వరుని ఆగ్రహానికి గురి కావచ్చట. కాబట్టి శని దేవుడిని పూజించిన తర్వాత వెన్ను చూపించకుండా అలాగే వెనకడుగు వేస్తూ రావాలి. శని దేవుడిని పూజించేటప్పుడు, ధరించే వస్త్రాల రంగుపై శ్రద్ధ వహించాలి. అంటే శని దేవుడిని పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోవాలి. శని దేవుడిని పూజించేటప్పుడు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎందుకంటే ఈ రంగులు శని దేవుడికి ఇష్టమైన రంగులు అని చెప్పవచ్చు. మీరు శని దేవుడికి నూనె ఇవ్వాలి అనుకుంటే రాగి పాత్రలను ఉపయోగించకూడదు.
ఇందుకు కేవలం ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే రాగి సూర్యునికి కారకం. సూర్యభగవానుడు శనిభగవానునికి తండ్రి అయినా, సూర్యభగవానుడు శని దేవుడు శత్రువులు కాబట్టి. శని దేవుడిని ఆరాధించేటప్పుడు దిశపై కూడా దృష్టి పెట్టాలి. సాధారణంగా, ప్రజలు తూర్పు వైపుకు తిరిగి పూజలు చేస్తారు. కానీ శని దేవుడు పశ్చిమానికి అధిపతి. కాబట్టి, మీరు శని దేవుడిని పూజించబోతున్నట్లయితే, పడమర ముఖంగా నిలబడి పూజించాలి.