Karthika Pournami 2023 : కార్తీక పూర్ణిమ రోజున ఏం చేయాలో…? ఏం చేయకూడదో తెలుసుకోండి..
కార్తీక పూర్ణిమ నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతారు
- By Sudheer Published Date - 07:17 AM, Mon - 27 November 23

నేడు కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2023) సందర్బంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు వచ్చి దీపాలు వెలిగిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను పూజిస్తారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం వల్ల సంపద, కీర్తి పెరుగుతుంది.
శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన, పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనది. కార్తీకమాసం మొత్తం చేసే పూజలన్నీ కలిపి ఇచ్చే ఫలితాన్ని ఒక్క కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ ఇస్తుందని పెద్దల నమ్మకం. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుడిని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. ఈ పౌర్ణమినే శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అనీ పిలుస్తారు. చంద్రుడు కృత్రికా నక్షత్రంతో కూడి ఉన్న మాసం కనుక దీనిని కార్తీకమాసం అంటారు.
కార్తీక పూర్ణిమ (Karthika Pournami ) నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతారు. కార్తీక పూర్ణిమ రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక పూర్ణిమ (Karthika Pournami ) రోజు ఏం చేయాలి.?
కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదీస్నానం చేయాలి. ఈ రోజు పవిత్ర నదిలో స్నానం చేయలేని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు.
దీని తరువాత, మీరు మీ పూజాగదిలో దీపాన్ని వెలిగించండి. అనంతరం ఆలయానికి వెళ్లి దీపదానం చేయండి.
కార్తీక పూర్ణిమ రోజున ఆహార ధాన్యాలు, పాలు, బియ్యం, జామకాయలు దానం చేయడం శ్రేయస్కరం.
ఈ రోజు సాయంత్రం చంద్రదేవునికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించాలి.
ఈ శుభ సందర్భంలో, మీరు లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం మహాలక్ష్మీ స్తుతిని పఠించవచ్చు.
సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఇది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.
(Karthika Pournami ) ఏం చేయకూడదు.?
కార్తీక పూర్ణిమ రోజున తామసిక ఆహారం తీసుకోకూడదు. ఈ రోజున వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ రోజున, పేదలకు సహాయం చేయడం తప్పనిసరి. అయితే పొరపాటున కూడా వారిని అవమానించకండి.
చంద్రదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి.
Read Also : Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కార్తీక పౌర్ణమి వేళ ఆలయంలో ప్రత్యేక పూజలు