Cow: గోమాతను ఎలా పూజిస్తే సంతానం కలుగుతుందో తెలుసా?
గోమాతను పూజించడంతో పాటు నైవేద్యాలను సమర్పిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:45 PM, Wed - 9 October 24

భారతదేశంలో హిందువులు ఆవును గోమాతగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే గోవు యొక్క మూత్రం పాలు , పేడ ఇవన్నీ కూడా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. గోమాతను పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు తరువాత కన్నతల్లి తరువాత గో మాత అని పిలిపించుకునే ఏకైన జీవి ఒక్క ఆవు మాత్రమే. అలాంటి గోమాత విషయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు.
అయితే ఆవుకి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే అని పూజ చేసినట్లే అని చెబుతున్నారు. అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. గోవునకు ఆహారం సమర్పించినట్లైతే 33కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. వివాహమైన తరువాత వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు. భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు వ్రతాలు చేస్తుంటారు.
తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలట. గోమాతకు అన్నం పెట్టడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి గోమాతను పూజించడంతోపాటుగా గోమాతకు నైవేద్యాన్ని సమర్పించడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుందని చెబుతున్నారు.