Trees: మీకు తెలుసా.. ఈ చెట్లను పూజిస్తే ధనవంతులు అవుతారట!
మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలలోని ఈ మొక్కలను పూజిస్తే ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఆ మొక్కలు ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:02 PM, Sat - 17 May 25

హిందూ మతంలో కొన్ని చెట్లను దేవళ్లుగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ చెట్లను పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని నమ్మకం. అంతేకాకుండా ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్కలను పూజిస్తే ధనవంతులు అవుతారట. ఇంతకీ ఆ మొక్కలు ఏవి అన్న విషయానికి వస్తే .. వేప చెట్టును దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టుని దుర్గా రూపంగా ఎల్లమ్మ దేవిగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ చెట్టును పూజించడం వల్ల వాస్తు పరమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.
అలాగే తులసి మొక్కను కూడా హిందువులు పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క వద్ద ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట. అలాగే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందట. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తే ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా హిందూ మతంలో మర్రి చెట్టును త్రిమూర్తులు అనగా.. బ్రహ్మా, విష్ణు,మహేశ్వరులకు చిహ్నంగా భావిస్తారు. పుట్టుక మరణం చిహ్నంగా ఉన్న ఈ చెట్టు మోక్షానికి ప్రదాతగా పరిగణిస్తారు.
రెండు మర్రి చెట్లను సక్రమంగా నాటిన వ్యక్తి మరణానంతరం శివ లోకానికి చేరుకుంటాడట. సంతానం లేని దంపతులు మర్రి చెట్టును పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే ఇంట్లోని పూజ గదిలో రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత శమి చెట్టి కింద దీపం వెలిగించాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయట. ప్రతి శనివారం నాడు ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని గ్రహస్థితి నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
రావి చెట్టును కూడా పూజించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని అలాగే సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని చెబుతున్నారు. ప్రతి శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని గ్రహ స్థితి కలుగుతుందట. రావిచెట్టును పూజించడం వల్ల మనం కోరిన కోర్కెలు వారికి నేరుగా చేరుతాయి. అందుకే ఈ చెట్టును పూజించాలని చెబుతున్నారు. విష్ణువుకు ఇష్టమైన చెట్లలో అరటి చెట్టు కూడా ఒకటి. గురువారం నాడు అరటి చెట్టును పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. గురువారం నాడు ఉపవాసం ఉండి, అరటి చెట్టును పూజించే వారు కూడా నీటిని సమర్పిస్తే బృహస్పతి బలపడతాడని, విష్ణువు కూడా ప్రసన్నుడవుతాడని చెబుతున్నారు.