Vastu : కిచెన్ లో ఉప్పును ఈవిధంగా వాడితే ఇంట్లో డబ్బే డబ్బు..!!
- By hashtagu Published Date - 06:23 AM, Mon - 21 November 22
వాస్తు బాగుంటే జీవితం బాగుంటుంది. జీవితంలో ప్రతి విషయాన్ని వాస్తు ప్రభావితం చేస్తుంది. ఇంటి గుమ్మం నుంచి మొదలుకుని వంటగదిలో ఉంచే వస్తువుల వరకు ప్రతివిషయంలో వాస్తు చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం…ఇల్లు కట్టుకుంటే…ఆ ఇంట్లో ఎప్పుడూ శుభం కలుగుతుంది. ఇవాళ వాస్తు శాస్త్రంలో మనం ఇంట్లో డబ్బు లోటు ఉండకుండా ఉండేందుకు ఎలాంటి నియమాలు అనుసరించాలో తెలుసుకుందాం.
వంటగదిలో ఉంటే…ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తులో ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పుకు ఎండబెట్టే లక్షణం ఉంటుంది. ఉప్పును సరిగ్గా ఉపయోగించినట్లయితే..ఇంట్లో నుంచి ప్రతికూల శక్తి వెళ్లిపోతుంది. ఉప్పును అధికంగా తీసుకుంటే కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
వాస్తు దోషాలను అధిగమించాలంటే ఉప్పును పలు మార్గాల్లో ఉపయోగించాలి.ఉప్పుకు శోషక లక్షణాలు ఉండటంతో ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తుంది. మీ ఇల్లు, ఆత్మ, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. జీవితంలో ప్రతికూలతను తొలగించుకునేందుకు ఉప్పుతో కొన్ని చిట్కాలు చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. మీరు అలసట, నిరాశ, ప్రతికూలవాతావరణంతో బాధపడుతున్నట్లయితే ఉప్పునీటితో స్నానం చేయండి. ఒక బకెట్లో కొంచెం ఉప్పు వేసి తల స్నానం చేయండి. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు.
2. మీరు కోరుకున్న ఫలితాలను పొందనట్లయితే..ప్రతిరోజూ ఉదయం మీ చేతిలో కొంచెం ఉప్పును తీసుకుని మీ తల, శరీరం చుట్టూ ఐదు నుంచి ఏడుసార్లు తిప్పి…నీటితో కడిగేయండి. ఇలా చేస్తే మీ ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.
3. ఇంట్లో డబ్బు కొరత ఉంటే…వాస్తు ప్రకారం…నైరుతి మూలలో ఒక గ్లాసునీటిలో ఉప్పు వేసి ఉంచితే ఇంట్లో డబ్బు నిలుస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.
4. వారానికోసారి ఉప్పుతో నేలను తుడుచుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలతను గ్రహిస్తుంది. దుమ్ము లేదా ధూళి శుభ్రం అవుతుంది. ఇలా చేస్తే ఇంట్లో సానుకూలత పెంచుతుంది.
Tags
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.