Vastu Tips: ఈ పనులు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం.. ఇక డబ్బే డబ్బు?
Vastu Tips: ఇంటి నిర్మాణం విషయంలో మాత్రమే కాకుండా ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.
- By Anshu Published Date - 07:30 AM, Sat - 8 October 22

Vastu Tips: ఇంటి నిర్మాణం విషయంలో మాత్రమే కాకుండా ఇంట్లో పెట్టుకునే కొన్ని వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న, ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి అన్న కొన్ని రకాల నియమాలను పాటించాలి అని చెబుతూ ఉంటారు. కొన్ని రకాల పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు ఎల్లప్పుడు ఆర్థిక సమస్యలకు లోటు అన్నది ఉండదు. మరి అందుకోసం ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇందుకోసం ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని చూసుకొని నాలుగు లేదా ఐదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది. నిద్ర లేవగానే ఎదుటివారి ముఖం చూడడం కంటే మన అరచేతులు చూసుకోవడం మంచిది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అదేవిధంగా మనం ఇంట్లో డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో కొన్ని అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు సూర్యుడు కాయలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు, శ్రీ సూక్తం చదివి అక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మన దగ్గర ఉన్నంత దానిలో కొంచెం దానధర్మాలకు ఉపయోగించడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని చెబుతున్నారు.
అదేవిధంగా మన ఇంటి కుల దైవానికి మొక్కులు చెల్లించడం ద్వారా కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన ఏదైనా వస్తువును చూడటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. రాజయోగం కలిగి ఎప్పుడు డబ్బులు ఉండాలి అంటే ప్రతి శనివారం ఇంట్లో పగిలినా విరిగిపోయిన వస్తువులను పారేయాలని చెబుతున్నారు. శనివారం సమయంలో ఇంట్లో బూజు దులపడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అన్ని పారిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే పర్సలో లేదా జోబీలో 2 లక్ష్మీ గవ్వలు,గోమతి చక్రాలు సూరీడు కాయలు పెట్టుకోవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు.