Spiritual: మీకు తెలియకుండానే పూజలు చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
Spiritual: దేవుడికి పూజలు చేసే సమయంలో మనం తెలియకుండా చేసే కొన్ని రకాల తప్పులు వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు. మరి దేవుడికి పూజలు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:30 AM, Sun - 12 October 25

Spiritual: చాలామంది హిందువులు ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇంకొందరు వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజలు ఎప్పుడు చేసినా కూడా చాలామంది తెలిసి తెలియకో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. ముఖ్యంగా దేవుడి పూజకి సంబంధించిన కొన్ని రకాల వస్తువులను ఎప్పుడు నేలపై పెట్టకూడదట. మరి పూజలు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో పూజ చేసే సమయంలో దీపారాధాన చేయడం చాలా మంచిది. దీపం నుంచి వెలువడే కాంతి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుందట. దీపం మానవ జీవితంలోని అన్ని సమస్యలను కూడా తొలగిస్తుందట. అంతేకాకుండా జీవితాన్ని కాంతితో నింపుతుందట. దీపారాధన చేయడానికి ముందు దీపాలను నేల మీద పెట్టకూడదట. దీపాన్ని ఎల్లప్పుడూ ఒక ట్రేలో ఉంచాలట. తర్వాత ఏదైనా ఆకు ఉంచి దాని మీద దీపాన్ని ఉంచాలట. ఇలా చేయకపోతే ఇంట్లో డబ్బు నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే శివలింగాన్ని చాలా మంది ఇంట్లో భక్తితో పూజిస్తూ ఉంటారు. శివుడు మొత్తం విశ్వం శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి మీరు పొరపాటున కూడా శివలింగాన్ని నేలపై ఉంచకూడదట. అలా ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
కాబట్టి శివలింగాన్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదట. ఒకవేళ మీరు శివలింగాన్ని ఉంచాలి అనుకుంటే తెల్లటి వస్త్రం పై పెట్టడం మంచిది అని చెబుతున్నారు. అలాగే పూజ గదిలో విగ్రహాన్ని కూడా ఎంతో గౌరవంగా ప్రతిష్టిస్తారు. కాబట్టి దేవుడి విగ్రహాన్ని ఎప్పుడూ నేలపై ఉంచకూడదట. దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచడం వల్ల ఆయన అవమానం జరుగుతుందట. ఇంటి శాంతికి భంగం కలుగుతుందని చెబుతున్నారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ప్రజలు తరచుగా దేవుడి విగ్రహాన్ని నేలపై ఉంచుతారు. కానీ అలా చేయడం తప్పు అని చెబుతున్నారు. ఆలయాన్ని శుభ్రపరిచేటప్పుడు, విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఒక వస్త్రం లేదా ట్రేపై ఉంచాలట.
శుభ్రం చేసిన తర్వాత, దానిని పూజ గదిలో తిరిగి అక్కడే పెట్టాలని చెబుతున్నారు. ఎప్పుడు కూడా బంగారు ఆభరణాలను నేలపై ఉంచకూడదట. బంగారం విష్ణువుకు చాలా ఇష్టమైనది. ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల నేలపై బంగారు ఆభరణాలను ఉంచడం అన్నది విష్ణువుతో సహా అన్ని దేవుళ్ళను అవమానించడమే అవుతుందని చెబుతున్నారు. విష్ణువు అవమానించకుండా, అతని ఆశీర్వాదాలు నిలిచి ఉండటానికి బంగారు ఆభరణాలను ఎప్పుడూ పాదాలకు ధరించకూడదట. నేలపై బంగారాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని చెబుతున్నారు.