Ganga Dussehra : మే 30.. మీ కోరికలు నెరవేరే టైం
గంగా మాత స్వర్గం నుంచి భూమికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగే "గంగా దసరా". ఈ వేడుకలో గంగానదిని పూజిస్తారు. "గంగా దసరా" (Ganga Dussehra) ఉత్సవాలు పది రోజులపాటు ఘనంగా జరుగుతాయి.
- By Pasha Published Date - 10:11 AM, Sat - 27 May 23

గంగానది.. మహా పవిత్రమైన నది. ఇందులో పుణ్య స్నానం చేస్తే సర్వ పాపాలూ హరించుకుపోతాయని పురాణాలు చెప్తున్నాయి. సూర్యచంద్రులను కనిపించే దైవాలలా భక్తులు విశ్వసిస్తారు. గంగానదిని కూడా కనిపించే దైవంగానే భావిస్తారు. గంగా మాత స్వర్గం నుంచి భూమికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగే “గంగా దసరా”. ఈ వేడుకలో గంగానదిని పూజిస్తారు. “గంగా దసరా” (Ganga Dussehra) ఉత్సవాలు పది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. రిషికేష్, హరిద్వార్, ప్రయాగ్, ఘర్ ముక్తేశ్వర్, వారణాసి ప్రాంతాల్లో గంగా దసరాను (Ganga Dussehra) వైభవంగా జరుపుతారు. ఈసారి “గంగా దసరా” పండుగ మే 30న జరుగుతుంది. దీని శుభ ముహూర్తం విషయానికి వస్తే.. మే 29న ఉదయం 11.49 గంటల నుంచి మే 30న మధ్యాహ్నం 1.07 గంటల వరకు ఉంటుంది. “గంగా దసరా” రోజున రాశిచక్రం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో విధమైన వస్తువులను దానం చేయాలి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పూజా విధానం ఇదీ..
గంగా దసరా రోజున ఉదయాన్నే నిద్ర లేచి గంగా స్నానం చేయాలి. గంగా మాతకు హారతి ఇవ్వాలి. గంగా స్నానానికి వెళ్లలేని వారు ఇంట్లోనే ఉండి.. స్నానపు నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేయాలి. ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించాలి. గంగా మాతను ధ్యానం చేయాలి. గంగా దసరా రోజు దానం చేయడం శుభ ఫలితాలు లభిస్తాయి.
Also read : Ganga Jal: గంగానదిలో స్నానానికీ.. గంగా జలం ఇంటికి తేవడానికీ కొన్ని నియమాలు ఉన్నాయి తెలుసా..?
గంగా దసరా రోజున 3 శుభ యోగాలు
* రవి యోగం – గంగా దసరా రోజున రవి యోగం ఉంటుంది.
* సిద్ధి యోగం – మే 29న రాత్రి 09.01 నుంచి మే 30న రాత్రి 08.55 వరకు ఈ యోగం ఉంటుంది.
* ధన యోగం – కర్కాటక రాశిలో శుక్రుని సంచారం వల్ల ధన యోగం ఏర్పడుతుంది.
Also read : Ganga Jal : గంగాజలం ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకపోవడానికి ఇవే కారణాలు.!!!
ఏ రాశి వారు.. ఏ వస్తువులను దానం చేయాలంటే..
* గంగా దసరా రోజు మేష రాశి వారు నువ్వులు, వస్త్రాలను దానం చేయాలి.
* వృషభరాశి వారు పేదలకు అన్నదానం, ధన దానం చేయాలి.
* మిథునరాశి వారు జలదానం చేయాలి.
* కర్కాటక రాశి వారు పసుపు పండ్లను దానం చేయాలి.
* సింహరాశి వారు రాగి పాత్రలు లేదా ధాన్యాలు, పండ్లు దానం చేయాలి.
* కన్యా రాశి వారు బిల్వ పత్రాన్ని దానం చేస్తే లాభాలు కలుగుతాయి.
* తులా రాశి వారు ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి.
* వృశ్చిక రాశి వారు సీజనల్ ఫ్రూట్స్ ను దానం చేయాలి.
* ధనుస్సు రాశి వారు నల్ల నువ్వులను దానం చేయాలి.
* మకర రాశి వారు మట్టి కుండలను దానం చేయాలి.
* కుంభరాశి వారు ఏదైనా ఆహార పదార్థాన్ని దానం చేయొచ్చు.
* మీన రాశి వారు జలదానం చేస్తే మంచిది.