HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >How To Whisper Your Prayers In Nandi S Ears So That Lord Shiva Will Fulfil It

Nandi: నందీశ్వరుని చెవిలో చెప్పిన కోరికలు నెరవేరుతాయా.. ఇందులో నిజమెంత?

హిందువులు ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలను పాటించడంతో పాటు మూఢనమ్మకాలను కూడా విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో నంది చెవిలో

  • Author : Anshu Date : 08-08-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nandi
Nandi

హిందువులు ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలను పాటించడంతో పాటు మూఢనమ్మకాలను కూడా విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో నంది చెవిలో కోరికలు చెప్తే నెరవేరుతాయి అనే నమ్మకం కూడా ఒకటి. మనం ఏ శివాలయానికి వెళ్లిన అక్కడ మనకు నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటారు. అయితే శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలు చెప్పుకోవడం వల్ల నెరవేరుతాయని ఆ కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. శివుడు తపస్సులోనే వుంటాడు.

ఆయన తపస్సుకు ఎప్పుడూ ఎలాంటి భంగం కలగకూడదు. అందుకే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియజేస్తాము. నంది శివునికి ఎదురుగా వుంటాడు కాబట్టి ఆయన వద్ద మన కోరికలు తెలియజేస్తే ఆయన శివుని దృష్టికి తీసుకెళ్తాడని పండితులు చెబుతుంటారు. ఏ భక్తులు తమ సమస్యలతో శివుని వద్దకు వచ్చినా, నంది అక్కడ వారి కోరికలను విని శివునికి తెలియజేస్తాడనేది నిజం. ఈ విధానాన్ని భక్తులు నంది చెవిలో చెప్పే ప్రతి విషయం తప్పక జరుగుతుందని విశ్వసిస్తుంటారు. నంది ఎవరిపైనా వివక్ష చూపడని నమ్ముతారు.

64 కళలలో దిట్ట అయినప్పటికీ వినయంగా వుండే నందీశ్వరుడు తన స్పష్టమైన పదాలతో శివునికి సందేశాన్ని అందిస్తాడట. అందుకే అతన్ని శివుని దూత అని కూడా పిలుస్తారు. నంది శివునికి ప్రధాన గణం, అందుకే శివుడు కూడా అతని మాట వింటాడు. పురాణాల ప్రకారం ఒక కథ కూడా ఉంది. మరి ఇంతకీ ఆ కథ ఏంటి అన్న విషయానికి వస్తే..
ఒకసారి శివుడు పార్వతితో ధ్యానం చేస్తున్నప్పుడు నంది కూడా ఆమెతో ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ సమయంలో అతను శివుని ముందు కూర్చుని తపస్సు చేస్తాడు. అందుకే నంది విగ్రహం ఎల్లప్పుడూ శివుని ముందు ఉంటుంది. ఒకప్పుడు జలంధరుడనే రాక్షసుడి నుండి తమను తాము రక్షించుకోవడానికి భక్తులందరూ శివుని వద్దకు వెళ్లారు. అతను తపస్సులో మునిగిపోయాడు. గణపతి కూడా శివునికి సందేశాన్ని తెలియజేయలేకపోయాడు. ఆ సమయంలో గణపతి కూడా నంది ద్వారా శివునికి సందేశాన్ని అందించాడు. నంది ద్వారా శివునికి మన కోరికలు ఏవైనా చెప్పినట్లయితే, అది నెరవేరుతుందని నమ్ముతారు. మరోవైపు, శివుడితో పాటు నందిని పూజించకపోతే, శివుని పూజ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలాగే విఘ్నేశ్వరుడికి ఏదైనా కోరిక చెప్పాలంటే ఎలుకతో చెవిలో చెప్పే ఆచారం కూడా వుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lord Shiva
  • Nandi

Related News

Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

హిందువులలో ఎక్కువ శాతం మంది కొలిచే దేవతలలో లక్ష్మీదేవి కూడా ఒకరు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదని భావిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునే వారు తమ ఇంట్లోని పూజా మందిరంలో కొన్

  • Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

    Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd