Camphor: జీవితంలో డబ్బు కొరత ఉండకూడదంటే కర్పూరంతో ఇలా చేయాల్సిందే?
ప్రతిరోజు ఇంట్లో కర్పూరంని ఉపయోగించడం వల్ల జీవితంలో డబ్బు కొరత ఉండదు అని చెబుతున్నారు..
- By Nakshatra Published Date - 04:00 PM, Thu - 5 September 24
సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. దేవుళ్ళ పూజలో తప్పనిసరిగా కర్పూరాలను ఉపయోగిస్తూ ఉంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత చివర్లో కర్పూరంతో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచే కర్పూరంని వినియోగిస్తున్నారు. కర్పూరంని ఉపయోగించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గులాబీ పువ్వులో కర్పూరంని ఉంచి తర్వాత సాయంత్రం పుష్పంలో ఒక కర్పూరం నుంచి వాటిని దుర్గాదేవికి సమర్పించాలట.
ఇలా చేస్తే ఆకస్మిక డబ్బును పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి పొందవచ్చుట. ఈ పనిని కనీసం 43 రోజుల పాటు చేయడం వల్ల సానుకూల ప్రభావాలను పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే రాత్రిపూట వంట గదిలో పని చేసిన తర్వాత లవంగాలు కర్పూరం రెండింటినీ వెండి గిన్నెలో వెలిగించాలట. ప్రతిరోజు ఈ పని చేస్తే జీవితంలో తప్పకుండా డబ్బు కొరత ఉండదని ధాన్య కొరత ఉండదని మీ ఇంట్లో ఎల్లప్పుడు శ్రేయస్సు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు దేవుళ్ళను పూజించేటప్పుడు వారి ముందు తప్పనిసరిగా కర్పూరం ని వెలిగించాలని చెబుతున్నారు. ఉదయం సాయంత్రం రెండు పూటలా కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట.
అలాగే ఇంట్లో ఉండేవారు వ్యాధులనుండి బయటపడతారని చెబుతున్నారు. ఇంట్లో ఆనందం, శాంతి సానుకూల శక్తి కోసం, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నెయ్యిలో కర్పూరం నానబెట్టి, దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయాలట. ఇలా చేయడం ద్వారా, ఇంట్లో ప్రతికూల శక్తి పోతుందని, పరస్పర ప్రేమ ఇంటి సభ్యుల మధ్య ఉంటుందని చెబుతున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవ ఉంటే కర్పూరం నివారణ ప్రభావంతంగా ఉంటుందట.. అయితే ఇందుకోసం భార్య కర్పూరం రాత్రి భర్త దిండు కింద ఉంచాలట. తర్వాత మొదటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ కర్పూరంని వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు శాంతి ఎల్లప్పుడూ ఉంటుందట.
Related News
Camphor: కర్పూరం వెలిగిస్తే నిజంగా దుష్టశక్తులు తొలగిపోతాయా?
దుష్టశక్తులు తొలగిపోవాలంటే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు.