Friday: శుక్రవారం రోజు లక్ష్మిదేవిని ఈ పూలతో పూజిస్తే చాలు.. ఇంట్లో తిష్ట వేయడం ఖాయం!
శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల తప్పకుండా లక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 02:35 PM, Thu - 5 September 24
వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అలా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడం వల్ల ఆమె అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తుంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు పండితులు. మరి శుక్రవారం ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలి అన్న విషయానికి వస్తే.. శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఉంటుందట. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
అయితే ఈ కోర్కెలు నెరవేరాలంటే శ్రీ మహాలక్ష్మిని ఎరుపురంగు పూలతో పూజించాలని చెబుతున్నారు పండితులు. ఎరుపు రంగులో ఉండే మందారం, గులాబీ, కలువ పూలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట. అందుకే ఎర్రటి పూలతో అమ్మను పూజిస్తే అనుగ్రహానికి తొందరగా పాత్రులవుతారని చెబుతున్నారు. అలాగే మందార పూల మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువైందని నమ్మేవారూ ఉన్నారు. ఈ ఎర్రటి పూలతో పాటూ గన్నేరు పూలను కూడా అమ్మవారి పూజకు వినియోగించవచ్చు. గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలకు లోటుండదట. అలాగే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా విశ్వసిస్తారు. ఎరుపు లేదా పసుపు గన్నేరపూలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందట.
చేపట్టిన పనులు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వఘ్నంగా పూర్తవుతాయని చెబుతున్నారు. వీటితో పాటూ బంతి, చామంతి లాంటి పసుపు రంగు పూలు పూజకు వినియోగించవచ్చని, అయితే పూజ చేసేముందు పూలను తడపకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఎర్రటి, పచ్చటి పూలతో పాటూ అమ్మవారి పూజలో శంఖం, గవ్వలు, శ్రీఫలం పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీఫలాన్ని నిత్యం పూజించే వారింట ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శ్రీ ఫలాన్ని వ్యాపార స్థలంలో అయినా, కార్యాలయంలో అయినా పెడితే ఆర్థికాభివృద్ధి ఉంటుంది. శ్రీ ఫలాన్ని నిత్యం పూజించే వారి చేతులమీద వృధా ఖర్చు అవదు. వ్యవసాయం చేసేవారు క్షేత్రంలో శ్రీ ఫలాన్ని ఉంచితే పంటలు బాగా పండుతాయని చెబుతారు. అయితే శ్రీ ఫలంతో ఎప్పుడూ నాణేలు కూడా ఉంచాలని చెబుతున్నారు.
ఇంట్లో లక్ష్మీదేవిని కొలువుతీర్చేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించాలట.అలాగే నిత్యం దీపారాధన లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అతిథి సత్కారాలు లేని ఇంట్లో అమ్మవారు అరక్షణం కూడా నిలువదట. భగవంతుడిని నిందించేవారి ఇంట, అసత్యాలు చెప్పినా, దుర్భాషలాడినా వారి ఇంట సిరిసంపదలు ఉండవట. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయంలో నిద్రపోయేవారి ఇంట కూడా శ్రీ మహాలక్ష్మి నిలవదని,సోమరుల ఇంటివైపు అమ్మవారు కన్నెత్తి కూడా చూడదని పండితులు చెబుతున్నారు.
Related News
Vasthu Tips: మీ పూజగదిలో లక్ష్మి,వినాయక విగ్రహాలు ఉన్నాయా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
లక్ష్మీదేవి వినాయక విగ్రహాలకు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదట.