Pradakshina: గుడిలో ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఇలా చేస్తే సమస్యలు తప్పవు!
మామూలుగా ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామంది తెలిసి తెలియక ప్రదక్షిణలు చేసే విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. మరి నిజానికి గుడిలో ప్రదక్షిణలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:32 PM, Tue - 24 December 24

మనలో కొద్దిమందికి ప్రతిరోజు గుడికి వెళ్లి అలవాటు ఉంటే ఇంకొంతమంది వారంలో రెండు మూడు రోజులు మాత్రమే గుడికి వెళ్తూ ఉంటారు. ఇంకొంత మంది కేవలం ఫెస్టివల్స్ సమయంలో మాత్రమే ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఆలయానికి వెళ్లడం మంచిదే కానీ తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రదక్షిణలు చేసే విషయంలో చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. మరి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదర్శనలు ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అన్న విషయానికొస్తే..
మొదట ఎప్పుడైనా సరే ఆలయంలోకి వెళ్లాక అక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని ముందుగా దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం దర్శనం తర్వాత ప్రధాన ఆలయంలోకి వెళ్లాలి. అయితే ఆలయంలో ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో ఆ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్టు. అలా ప్రదక్షిణలు మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్తే అక్కడ ఐదు ప్రదక్షిణలు చేయడం మంచిది. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఐదు లేదా 11 ప్రదక్షిణలు 27 ప్రదక్షిణలు 54 ప్రదక్షిణలు లేదంటే 108 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం ఉంటుందట.
ఇక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి అనుకున్న వారు 3 లేదా 9సార్లు ప్రదక్షిణాలు చేయవచ్చట. అంతకంటే ఎక్కువ చేయాలి అనుకున్న వారు 11 లేదా 21 లేదా 27 ప్రదక్షిణలు చేయవచ్చని చెబుతున్నారు. ఎప్పుడు కూడా రెండు ప్రదక్షిణలు చేయకూడదు. మూడు లేదా ఐదు లేదా ఏడు ఇలా బేసి సంఖ్యలు వచ్చేలా ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయట. గుడిలో చాలామందికి ప్రదక్షిణలు ఎలా చేయాలో తెలియక రివర్స్లో కూడా చేస్తూ ఉంటారు. ఇలా రివర్స్లో చేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.అలాగే చాలామంది ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాతధ్వజస్తంభం ముందు నుంచి వెళ్తుంటారు.కానీ అలా అస్సలు చేయకూడదు .