What to Offer : దేవుళ్లు… వారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసా..?
మనలో చాలామందికి ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. చాలామంది తమకు ఇష్టమైన దేవుళ్లకు ఏలాంటి ఆహారం పెట్టాలో తెలియక వాటిని సమర్పించడానికి సుముఖంగా ఉంటారు.
- By hashtagu Published Date - 05:30 AM, Fri - 1 July 22
 
                        మనలో చాలామందికి ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. చాలామంది తమకు ఇష్టమైన దేవుళ్లకు ఏలాంటి ఆహారం పెట్టాలో తెలియక వాటిని సమర్పించడానికి సుముఖంగా ఉంటారు. ప్రతిరోజూ ఇంట్లో దేవతలను పూజించడానికి చాలామంది ఇష్టపడతారు. వారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. అప్పుడు వారి ప్రథమ ఎంపిక లడ్డూ లేదంటే పాయసం. అయితే ఈ ప్రసాదాలు అందరు దేవుళ్లకు నచ్చవు. మరి ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం.
విష్ణువు:
విష్ణువుకు పసుపురంగులో ఉండే నైవేద్యం సమర్పిస్తారు. తేనె, అరటిపండ్లు వంటివి. అంతేకాదు విష్ణువుకు 56 రకాల నైవేద్యాలతో పూజిస్తుంటారు.
శివుడు:
శాస్త్రాల ప్రకారం పరమశివుడు కంద ఫలాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. తెల్లని స్వీట్లు, పాలు, ధాతుర వంటివి కూడా ఆ పరమేశ్వరుడికి ఇష్టం.
శని:
శనిదేవుడి ఆగ్రహం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈయన ముఖ్యంగా నలుపును ఇష్టపడతాడు. శనికి ఇష్టమైన నైవేద్యం బెల్లంతో చేసిన నల్లనువ్వులు. శనిదేవుడి తల్లి ఛాయదేవి గర్భం దాల్చిన సమయంలో ..రోజుల తరబడి నీరు, ఆహారం లేకుండా మండే ఎండలో తపస్సు చేసిందని చెబుతుంటారు.
సరస్వతీ దేవి:
సరస్వతీ దేవి జ్ఞానం ,సరళత దేవత. సరస్వతి తాజా పండ్లను ఇష్టపడుతుంది. ముఖ్యంగా మిశ్రికండ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంది. సరస్వతి దేవికి అన్నం లేదా అటుకులు, పెరగన్నం, కిచ్డీకూడా చాలా ఇష్టం. సరస్వతీ దేవి ఆరాధన సమయంలో ఆమెకు బూందీ కూడా పెడుతుంటారు.
దుర్గమాత:
దుర్గామాతకు పూజా సమయంలో పెసరపప్పుతో చేసిన కిచిడీ, పాయసం సమర్పిస్తారు.
లక్ష్మీదేవి:
కీర్తి, శ్రేయస్సును ఇచ్చే దేవత. పాయసం, లడ్డూ నైవేద్యంగా పెడతారు. కొబ్బరి లడ్డూ, హల్వా కూడా ఇష్టం
శ్రీ కృష్ణ:
శ్రీ కృష్ణ భగవానుడికి వెన్న పాలు, మిస్రి, లడ్డూ అంటే ఇష్టం.
కాళీ దేవత:
కాళీ మాతకు బియ్యంతో చేసిన వంటకాలను చాలా ఇష్టపడుతుందని నమ్ముతారు. ఆమెకు ఎక్కువగా కిచ్డీ, ఖీర్ నైవేద్యంగా ఇస్తారు.
హనుమంతుడు:
హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని ఆస్వాదిస్తాడు. మసూర్ పప్పు, బెల్లం, దానిమ్మ ,మోతీచూర్ లడ్డూను నైవేద్యంగా ఇష్టపడతాడు.
గణేశుడు:
గణేశుడికి ఇష్టమైన నైవేధ్యం మనందరికీ తెలుసిందే. ఆయనకు మోదకం, లడ్డూ అంటే చాలా ఇష్ఠం
 
                    



