Dream: మంటల్లో ఇల్లు కాలిపోయినట్టు కల వస్తే అర్ధం ఏంటో తెలుసా?
సాధారణంగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో కొన్ని రకాల పీడకలు
- Author : Anshu
Date : 15-11-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో కొన్ని రకాల పీడకలు వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. మనం పడుకున్నప్పుడు కలలో అగ్ని కనిపిస్తే దానిని పీడకలగా భావిస్తూ ఉంటారు. కాగా కలలో అగ్ని కనిపించడం కీడుకు సంకేతం కాదు అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో ధనం రావాలి అంటే అగ్ని దేవుడిని ఆరాధించేవారు. అగ్ని దేవుడిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు కలలు అగ్ని వేరువేరు రూపాలలో కనిపిస్తూ ఉంటుంది.. అంటే ఒకసారి కాగడా రూపంలో మరికొన్నిసార్లు జ్వలిస్తున్నట్టు ఒక దీపం రూపంలో లేదంటే ఇల్లు చెట్లు కాలిపోయినట్టు ఇలా అనేక రకాలుగా కలలో అగ్ని కనిపిస్తూ ఉంటుంది.
అయితే కలలో అగ్ని దహించుకుపోతున్నట్లుగా వస్తే అది దీనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలు ఎప్పుడైనా అగ్ని కాగడా రూపంలో కనిపిస్తే అది మంచిది. అలాగే కలలో అగ్ని చిన్న మంట రూపంలో కనిపిస్తే కూడా అది విజయానికి సంకేతం. అలాగే అప్పులు కూడా తీరిపోతాయట. అయితే కలలు అగ్ని కనిపించినప్పుడు కొన్ని కొన్ని సార్లు మంచి జరుగుతుంది మరి కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది. ఒకవేళ మనకు కలలో ఊరు మొత్తం తగలబడి పోతున్నట్టుగా కనిపిస్తే అది అశుభ ఫలితం. అదేవిధంగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కాలిపోతున్నట్లు చుట్టూ అగ్ని అంటుకున్నట్టు కలలో కనిపిస్తే అది మీరు అప్పుల వలయంలో చెప్పుకోబోతున్నారని ఆపదలో చిక్కుకోబోతున్నారు అని అర్థం.
స్వప్న శాస్త్ర ప్రకారం కలలు ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చూసిన అంశం కానీ విన్న అంశం కానీ ఊహించుకున్నది కానీ కలలో వస్తే అటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకూడదు. అలాంటి కలల వల్ల ఎటువంటి ఫలితాలు జరగవు అని చెబుతున్నారు పండితులు.