Hair in Food: తినే ఆహారంలో తరచూ వెంట్రుకలు కనిపిస్తున్నాయా.. అయితే మీ జీవితంలో రాబోయే మార్పులు ఇవే!
భోజనం చేసేటప్పుడు తరచుగా వెంట్రుకలు రావడం అన్నది అంత మంచి విషయం కాదని ఎలా ఎక్కువ సార్లు రావడం అన్నది కొన్ని రకాల మార్పులకు సంకేతం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 AM, Sat - 4 October 25

Hair in Food: మామూలుగా మనం ఇంట్లో భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెంట్రుకలు కనిపించగానే ఇంట్లో మగవారు ఆడవారిని తిడుతూ ఉంటారు. కొంతమంది భోజనంలో వెంట్రుకలు వస్తే అస్సలు తినరు. ఇంకొందరు ఆ వెంట్రుకలను పక్కకు తీసేసి తింటూ ఉంటారు. అయితే తినే ఆహారంలో వెంట్రుకలు కనిపించడం ఆహారాన్ని అపవిత్రం చేస్తుంది. చాలా మంది దీనిని నిర్లక్ష్యం లేదా పరిశుభ్రత లేకపోవడానికి కారణమని భావిస్తారు.
కానీ ఆహారంలో వెంట్రుకలు తరచుగా కనిపించడం అనేది సాధారణ తప్పు కాదట. కానీ ఇది మీ కోసం విశ్వం ఇచ్చే సంకేతం అని అంటున్నారు. మరి తరచుగా భోజనంలో వెంట్రుకలు కనిపిస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా శని దేవుడిని న్యాయ దేవుడు అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే. ఆయన భక్తులకు కష్టసుఖాలను అందిస్తూ ఉంటారు. కొన్ని సంకేతాలను కూడా పంపిస్తూ ఉంటారు. వాటిలో ఆహారంలో వెంట్రుకలు కనిపించడం కూడా ఒకటి. ఇలా ఆహారంలో వెంట్రుకలు కనిపించినప్పుడు దాని అర్ధం పాత కర్మలను వదిలేసి మంచి కర్మలు చేయాలని, అలాగే ప్రతికూల అలవాట్లకు దూరంగా ఉండాలని, మనం తీసుకునే మంచి ఆహారమే మన భావోద్వేగం అని గుర్తించాలని అర్ధం.
అయితే శని దేవుడు చెడు మాత్రమే చేస్తాడు అనుకుంటే పొరపాటు పడినట్లే. న్యాయం, కర్మకు ప్రధాన దేవుడు. శని వేసేవి శిక్షలు కాదు జీవితాన్ని మెరుగుపర్చే పాఠాలు. మంచి భవిష్యత్ కోసం ఏం చేయాలో సూచించే హెచ్చరికలు. ఆహారంలో వెంట్రులకు తరచూ కనిపించడం కూడా శని ఇచ్చే సంకేతమే అని అంటున్నారు. పదేపదే ఆహారంలో వెంట్రుకలు కనిపించడం అన్నది శని గ్రహానికి సంబంధించిన హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి తన జీవితంలో కొన్ని మెరుగుదలలు చేయాలని సూచిస్తుందట. శని దశ సమయంలో వ్యక్తి ఇలాంటి సంకేతాలను తరచుగా అనుభవించవచ్చు. ఇది ఆత్మపరిశీలన సమయం అని చెబుతున్నారు. అలాగే శని దేవుడు నేరుగా శిక్షించడు. కానీ రోజువారీ సమస్యల ద్వారా జీవితంలో మెరుగుదల సందేశాన్ని ఇస్తాడట. పదేపదే ఏదో కోల్పోవడం, ఆలస్యం కావడం లేదా ఆహారంలో వెంట్రుకలు కనిపించడం ఇలాంటి వన్నీ కూడా శని దేవుడు వచ్చే సందేశాలు అని అర్ధం చేసుకోవాలి.