Dhanteras 2024: ధంతేరాస్ రోజు వీటిని కొని ఇంటికి తీసుకొస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
ధంతేరాస్ పండుగ రోజున ఎలాంటి వస్తువులు ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుంది అన్న విషయాల గురించి తెలిపారు..
- By Anshu Published Date - 11:43 AM, Sun - 20 October 24

ప్రతి ఏడాది దీపావళి పండుగ సమయంలో జరుపుకునే పండుగ ధంతేరాస్. ఈ రోజున ధన్వంతరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ధన్వంతరిని పూజించడం వల్ల ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు అలాగే ఇతర కష్టాలు దూరం అయ్యి మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ ధంతేరాస్ నుంచే దీపావళి పండుకు ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29 న ధంతేరాస్ వస్తుంది. ధంతేరాస్ రోజున చాలా మంది బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అవే కాకుండా ఇప్పుడు చెప్పే వాటిని కూడా కొనుగోలు చేయవచ్చట. బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలను కొనలేని వారు కూడా ఉంటారు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పే వాటిని కొన్నా చాలా మంచిదని, ఆర్థికంగా బలపడతారని అంటారు. మరి ఈరోజున ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి అన్న విషయానికొస్తే.. హిందూ సంప్రదాయం ప్రకారం తమలపాకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తమలపాకుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ధంతేరాస్ రోజున తమలపాకులను కొని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. ఆ తర్వాత ఆ తమలపాకులను ఏదైనా పవిత్ర నదిలో లేదంటే పారి నీటిలో విడిచిపెట్టడం మంచిది. అదేవిధంగా ఈ ధంతేరాస్ రోజున కొత్తిమీరను కొని ఇంటికి తీసుకురావడం కూడా చాలా మంచిదట. కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదట.
అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ ధంతేరాస్ రోజున ఆ పసుపు కుంకుమలని ఇంటికి తీసుకురావడం మంచిదట. ఈ విధంగా చేయడం వల్ల స్త్రీల వివాహిక జీవితం బాగుంటుందట. అదృష్టం కూడా కలిసి వస్తుందట. అదేవిధంగా ఈరోజున కొనాల్సిన వస్తువులలో చీపురు కూడా ఒకటి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున చీపురును కొనుగోలు చేసి ఎందుకు తీసుకురావడం వల్ల ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇలా చేస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయట. అదేవిధంగా ఈ రోజున లేనివారికి వాటి అవసరం ఉన్నవారికి చీపుర్లు చెప్పులు గొడుగులు వంటివి కొని ఇచ్చిన మంచే జరుగుతుందని చెబుతున్నారు. ధంతేరాస్ రోజు ఉప్పు కొన్నా చాలా మంచిది. ఉప్పును కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. ఉప్పును లక్ష్మీ దేవిగా అనుకుంటారు. అందుకే ఎవరికైనా ఉప్పును అడిగి తీసుకోరు. కాబట్టి ఈ రోజున ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినా మంచిదేనట.