Lakshmi Devi: పొరపాటున కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయకండి.. చేశారో ఇక అంతే సంగతులు!
లక్ష్మీదేవికి కోపం తెప్పించే పనులు పొరపాటున కూడా చేయకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Sun - 25 August 24

మామూలుగా ప్రతి ఒక్కరు లక్ష్మి అనుగ్రహం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజ నియమాల పాటించడంతో పాటు రకరకాల హోమాలు వ్రతాలు, దానధర్మాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే శాంతి మరియు ప్రశాంతత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి అలాంటప్పుడు మీరు అమ్మవారికి కోపం కలిగించే పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. మీరు తెలిసి లేదా తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు లక్ష్మీ దేవిని బాధపెట్టి ఉండవచ్చు. మరి లక్ష్మీదేవికి కోపం తెప్పించే ఆ పనులు ఏంటి?ఒకవేళ కోపం తెప్పిస్తే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మంది తమ పాత్రలను ఇంట్లో ఎలాపడితే అలా ఉంచుతారు. చాలా మంది రాత్రిపూట మురికి వంట సామాన్లను ఉంచి ఉదయం కడుగుతారు. అయితే చర్య మంచి విషయంగా పరిగణించబడదట. ఇలాంటి పాత్రలు పోగుచేసి ఇంట్లో మురికిగా ఉంచడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందట. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి మీరు తిన్న ఆహార పదార్థాలను రాత్రి శుభ్రం చేయడం మంచిది. అలాగే కిచెన్, గ్యాస్ వంటివి రాత్రి శుభ్రం చేయడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తరాన సంపద దేవత కుబేరన్, శ్రేయస్సు దేవత లక్ష్మి దేవి యొక్క దిశగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇంటి ఉత్తరం వైపున వ్యర్థాలు లేదా పైల్స్ నిల్వ ఉంచకూడదు. ఇంటిలోని ఈ భాగం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. పనికిరాని వస్తువును ఇక్కడ ఉంచితే లక్ష్మీ దేవి, కుబేరులకు కోపం వస్తుందట.
ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం సంపద ప్రవాహానికి ప్రయోజనం చేకూరుస్తుందనీ చెబుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా కాళీ పాత్రలను స్టవ్ పైన ఉంచకూడదట. అలాగే ఇంట్లో పొయ్యిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతికి దారితీస్తుందట. అలాగే సమాజంలో శ్రేయస్సు, గౌరవాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఖాళీ పాత్రలను స్టవ్ పైన ఉంచడం వల్ల మీరు పేదరికానికి దారితీస్తుందట. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీ దేవి ఎప్పటికీ నివసించదట..పూజ గది తర్వాత ఇంట్లో వంటగది అత్యంత అనువైన ప్రదేశం కాబట్టి వంట గదిని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. అలాగే సూర్యాస్తమయం తరువాత మీరు ఇంటిని తుడుచుకుంటే అది దురదృష్టానికి సూచికగా పరిగణించబడుతుంది.
లక్ష్మి దేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు. సూర్యా స్తమయం సమయంలో, చీపురు ఉపయోగించి లక్ష్మీ దేవికి కోపం వచ్చి ఇంటి నుండి వెళ్లిపోతుందట. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇల్లు క్లీన్ చేయక పోవడం మంచిది. చాలామంది పూజలో గంధం ఉపయోగిస్తూ ఉంటారు. ఆ గంధం కోసం ఒక చేత్తో గంధపు చెక్కను ఎప్పుడూ రుద్దుతూ ఉంటారు. కానీ అలా చేయడం విష్ణువును అవమానించడానికి సమానం. లక్ష్మీ దేవికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. అలాగే, గంధపు చెక్కను రుద్దిన తర్వాత, మీరు దానిని నేరుగా విగ్రహం మీద వేయకూడదు. అది మంచి విషయంగా పరిగణించబడదు. మొదట గంధపు గిన్నెను ఒక గిన్నెలో వేసి, ఆపై విగ్రహం మీద రాయాలి. అలాగే గంధం రుద్దేటప్పుడు రెండు చేతులను ఉపయోగించాలని చెబుతున్నారు లక్ష్మీదేవిని ఆరాధించేవారు లక్ష్మీదేవితో పాటు విష్ణువును కూడా ఆరాధించాలని చెబుతున్నారు . చాలామందికి సూర్యాస్తమయం తరువాత నిద్రపోయే అలవాటు ఉంటుంది. అంటే సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రపోతూ ఉంటారు. కానీ ఈ నిద్ర అసలు మంచిది కాదట. ఇలా సాయంత్రం సమయంలో పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుందట. అయితే ఈ విషయంలో పిల్లలకు అలాగే వృద్ధులకు ఆరోగ్యం బాగా లేని వారికి మినహాయింపు లభిస్తుందని చెబుతున్నారు.