God Idols : దేవుడి బొమ్మలు గిఫ్టుగా ఇస్తున్నారా ? ఇవి తెలుసుకోండి
వివిధ వేడుకలు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనం రకరకాల గిఫ్టులను ఇస్తుంటాం.
- By Pasha Published Date - 04:54 PM, Sun - 28 July 24

God Idols : వివిధ వేడుకలు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు మనం రకరకాల గిఫ్టులను ఇస్తుంటాం. ఈ గిఫ్టుల జాబితాలో దేవుళ్ల బొమ్మలు కూడా ఉంటాయి. ఈవిధంగా దేవుళ్ల బొమ్మలను(God Idols) గిఫ్టుగా ఇచ్చే సందర్భంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
దేవుళ్ల బొమ్మలు ఎంతో ప్రభావాన్ని, శక్తిని కలిగి ఉంటాయి. అందుకే వాటిని ఆచితూచి ఎంపిక చేయాలి. సందర్భాన్ని బట్టి ఏ విగ్రహాన్ని ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలి. జ్యోతిష్య, వాస్తు శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఉండే దేవుళ్ల బొమ్మలనే గిఫ్టులుగా ఎంపిక చేసుకోవాలి. మనం ఎవరికైతే వాటిని బహూకరిస్తామో వారికి.. ఆ బొమ్మను ఎలా నిర్వహించాలి ? ఇంట్లో ఎక్కడ ఉంచాలి ? అనేది తెలియజేయాలి. దానివల్ల వారు దోషాలు చేయకుండా నిలువరించే అవకాశం ఏర్పడుతుంది.
Also Read :Another Scheme : ఏపీలో ఆగస్టు 15 నుండి మరో పథకం అమలు
ఇవి గుర్తుంచుకోండి..
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తికి జన్మ కుండలి ఆధారంగా ఒక శక్తి క్షేత్రం ఉంటుంది. మనం గిఫ్టుగా ఇచ్చే దేవుడి బొమ్మ అనేది ఆ వ్యక్తి శక్తి క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. శక్తి క్షేత్రంలోని శక్తికి, దైవప్రతిమలోని శక్తికి మధ్య బ్యాలెన్స్ సరిగ్గా లేకుంటే జీవితం అస్థిరంగా మారొచ్చు.
- మనం గిఫ్టుగా అందించే దేవుడి బొమ్మ.. దాన్ని తీసుకునే వారి జాతకానికి సరిపోకపోతే ఇబ్బందులు ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. గ్రహస్థితుల ఆధారంగా జాతకం..జాతకం ఆధారంగా జీవితం ప్రభావితం అవుతుంటాయి.
- మనం గిఫ్టుగా ఇచ్చే దేవుడి బొమ్మకు తగిన పూజలు చేయకున్నా అపచారం జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల వ్యతిరేక ఫలితాలు రావచ్చు. ఫలితంగా గిఫ్టును తీసుకునే వారు నకరాత్మక శక్తుల ప్రభావానికి లోనయ్యే రిస్క్ ఉంది.
- దేవుడి బొమ్మను అందుకున్న తర్వాత దాన్ని ఇంట్లో తగిన స్థానంలో ఉంచాలి. ఈక్రమంలో వాస్తు నియమాలను పాటించాలి.
- దేవుడి బొమ్మను మన ఇంట్లో ఉంచుకుంటే.. దాని ప్రభావం మన ఆధ్యాత్మిక ఆలోచనలపై పడటం మొదలవుతుంది. ఈ ఆలోచనలను సకారాత్మకంగా ముందుకు తీసుకెళ్లే వారు మంచి ఫలితాలు పొందుతారు. నిర్లక్ష్యం చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి.
- గిఫ్టుగా తీసుకున్న దైవ ప్రతిమలోని శక్తుల ప్రభావం జీవితంపై పడే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తి అవగాహన లేకుండా దైవ ప్రతిమలను ఇతరులకు గిఫ్టుగా ఇవ్వకూడదు. పండితుల(Astrology) సలహాలు తీసుకున్న తర్వాతే దైవ ప్రతిమలను గిఫ్టుగా ఇస్తే బెటర్.
Also Read :Brake Disc Wiping: కార్లలో బ్రేక్ డిస్క్ వైపింగ్ సిస్టమ్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.