Navratri Puja: దేవీ నవరాత్రులు ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. దసరా ముహూర్తం ఎప్పుడు…!!
సెప్టెంబర్ నెలలో ఈ సంవతర్సం నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. భాద్రపదం ముగిసి ఆశ్వీయుజం ప్రారంభంతోనే నవరాత్రులు ప్రారంభకానున్నాయి.
- By hashtagu Published Date - 06:00 AM, Fri - 16 September 22

సెప్టెంబర్ నెలలో ఈ సంవతర్సం నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. భాద్రపదం ముగిసి ఆశ్వీయుజం ప్రారంభంతోనే నవరాత్రులు ప్రారంభకానున్నాయి. నవరాత్రుల అనంతరం చేసే విజయ దశమి భారతీయ సంస్కృతిలో చాలా పెద్ద పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధన చేసేవారు నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. ఈసారి శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో ప్రజలు ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించారు. అయితే ఈసారి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి అనేది చాలా ముఖ్యం. మరి ఈసారి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేది తెలుసుకుందాం.
శారదీయ నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటాయి?
26 సెప్టెంబర్ – శైలపుత్రి మాత ఆరాధన,
సెప్టెంబరు 27 – మాత బ్రహ్మచారిణి ఆరాధన,
సెప్టెంబర్ 28 – మాత చంద్రఘంట ఆరాధన,
సెప్టెంబర్ 29 – మా కూష్మాండ ఆరాధన,
సెప్టెంబర్ 30 – మాత స్కందమాత ఆరాధన,
అక్టోబర్ 01 – మా కాత్యాయని ఆరాధన,
అక్టోబర్ 02 – మా కాళరాత్రి ఆరాధన,
అక్టోబర్ 03 – మా మహాగౌరీ ఆరాధన,
అక్టోబర్ 04 – మా సిద్ధిదాత్రి ఆరాధన,
అక్టోబర్ 05 – విజయదశమి లేదా దసరా.
శాస్త్రం ప్రకారం, నవరాత్రుల మొదటి రోజున అంటే సెప్టెంబర్ 26న ఉదయం 8.06 గంటల వరకు శుక్ల యోగం ఉంటుంది. దీని తర్వాత బ్రహ్మయోగం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ల మరియు బ్రహ్మ యోగంలో పూజించడం శుభం, ఫలప్రదం.
– శారదీయ నవరాత్రులు అక్టోబర్ 05తో ముగుస్తాయి. దేవి భాగవత పురాణం ప్రకారం, నవరాత్రుల చివరి రోజు నుండి, మాతా దుర్గ నిష్క్రమణ ఎప్పుడు ఉంటుందో తెలుస్తుంది.