Karna and Duryodhana: స్నేహమంటే ఇదేరా!
అనుమానం అనే మహమ్మారిని ఒక్కసారి జీవితంలోకి ఆహ్వానిస్తే ప్రతిక్షణం అది మన శరీరాన్ని తినేస్తునే ఉంటుంది. అనుమానంతో కొన్ని రాజ్యాలే కూలిపోయాయి.
- By Praveen Aluthuru Published Date - 02:29 PM, Mon - 14 August 23

Karna and Duryodhana: అనుమానం అనే మహమ్మారిని ఒక్కసారి జీవితంలోకి ఆహ్వానిస్తే ప్రతిక్షణం అది మన శరీరాన్ని తినేస్తునే ఉంటుంది. అనుమానంతో కొన్ని రాజ్యాలే కూలిపోయాయి. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. పురాణాల్లో దుర్యోధనుడి ఇంటికి కర్ణుడు వెళ్ళాడు. ఆ సమయానికి దుర్యోధనుడి భార్య భానుమతి చెలికత్తెతో పాచికలు ఆడుతుంది. అప్పుడు కర్ణుడిని చూసిన చెలికత్తె అక్కడినుండి జారుకుంటుంది. ఇది గమనించని భానుమతి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఆడు అన్నది. తనని ఆడమంటుందేమో అనుకున్న కర్ణుడు భానుమతి పక్కన కూర్చుని పాచికలు వేసే సమయంలో దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడి రాకను గమనించిన భానుమతి వెంటనే లేచి వెళ్లి తనని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అయితే ఆటలో ఓడిపోతుంది అందుకే భానుమతి లేచి వెళ్తుందని భ్రమించి కర్ణుడు భానుమతి చీర కొంగును పట్టుకుపోబోయాడు. దాంతో కొంగుకి ఉన్న పూసలు ఊడిపోతాయి. అది చూసిన దుర్యోధనుడు ఏ మాత్రం అనుమానపడకుండా ఆ పూసలను నేను తీస్తానులే అంటూ పూసలను తీసి భార్యకు ఇచ్చాడు దుర్యోధనుడికి తన స్నేహితుడు కర్ణుడు, భార్యపై ఉన్న నమ్మకం అలాంటిది.ఇలాంటి పురాణ కథలు నేటి తరానికి చాలా అవసరం.
Also Read: Devotional Tree: భారత్ లో ఆధ్యాత్మిక శక్తి ఉన్న చెట్లు ఏవో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!