Friday: లక్ష్మి అనుగ్రహం కావాలా.. అయితే శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి!
లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు కొన్ని రకాల పొరపాటు చేయకూడదని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 12:30 PM, Wed - 28 August 24

వారంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ముందే కానీ, కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా శుక్రవారం రోజున తెలిసి తెలియకుండా కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. మరి శుక్రవారం రోజున ఎలాంటి పనులు చేయాలి ఇలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రచి,ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి. అనంతరం అభ్యంగ స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి.
ఇక శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితులలో కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు. ఈరోజున అందరితో మంచితనంగా వెలగడం మంచిది. చిన్నా పెద్ద ఇలా ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అలాగే శుక్రవారం రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా శుక్రవారం రోజు డబ్బులు కానీ ఉప్పు కానీ దానంగా అప్పుగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేస్తే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అలాగే వంట గదిలో ఉప్పు, బెల్లం వంటి పదార్ధాలకు లోటు లేకుండా చూసుకోవాలి. అంతేకాదు వీటిని శుక్రవారం రోజున ఇంటికి తీసుకుని రావాలి.
ఇలా చేస్తే ఇంట్లో ఎన్నడూ డబ్బులకు లోటు ఉండదట. అలాగే పురుషులు శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలి పై గొడవ పడడం ఆమెతో కన్నీరు పెట్టించడం లాంటివి అస్సలు చేయకూడదు. అంతేకాదు ఇంటి కోడలిని ఊరుకి గానీ లేదా మరొక చోటకు పంపకూడదు. ఎందుకంటే కోడలు ఇంటికి లక్ష్మీదేవి స్వరూపం అని నమ్మకం. కనుక శుక్రవారం రోజున ఇంటి కోడలిని ఉసురుపెట్టవద్దు. అలాగే శుక్రవారం రోజు మాంసాహారం ఆల్కహాల్ వంటివి అసలు తీసుకోకూడదు. పైన చెప్పిన పొరపాట్లు చేయకుండా శుక్రవారం రోజు భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు.