Lakshmi Devi: ఆర్థిక నష్టాల నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేయాల్సిందే?
కొంతమంది ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఎంత
- By Nakshatra Published Date - 07:00 AM, Tue - 20 December 22
కొంతమంది ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో మిగలడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా కూడా డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుందని అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఆర్థిక సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ వాటితో పాటు మనసు కూడా మంచిగా ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలి. ఎందుకంటే మీలో ఉన్న కొన్ని చెడు అలవాట్లు మిమ్మల్ని ఇద్దరుద్దులుగా మారుస్తాయి. ఎటువంటి అలవాట్లు మానుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి ఎప్పుడు నివసిస్తుంది. అలాగే ఇంట్లోనే ఈశాన్య దిశలో ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండకూడదు. అలా ఉండటం మంచిది కాదు. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయాలి. చెత్త ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అలాగే చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపురును లక్ష్మీ చిహ్నంగా భావిస్తారు. అలాగే డబ్బులు నగలు ఉంచే ప్రదేశంలో ఎప్పుడు చీపురును ఉంచకూడదు. అలా చేయడంవల్ల అది మీ ఆర్థిక ఆదాయంపై ప్రభావం చూపుతుంది. డబ్బు నీళ్లు లాగా ఖర్చు అవుతుంది. ఇంట్లో పెద్దవారిని ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని ప్రేమతో పలకరిస్తూ ఎప్పుడూ వాళ్ళతో సంతోషంగా మెలగాలి.
అలాగే చిన్న చిన్న వాటికి గట్టిగటిగా అరవడం అలాగే అనవసరంగా ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం వంటివి చేయడం వల్ల నెగెటివిటీ పెరుగుతుంది. తద్వారా అది మీ ఆదాయం పై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంటి ఆగ్నేయ దిశలో ఎప్పుడు డబ్బు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటి యజమాని దగ్గర ఆదాయం తగ్గుతుంది. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎల్లప్పుడూ డబ్బుకు విలువ ఇవ్వాలి. అప్పుడే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది ఆర్థిక సమస్యలు వెంటాడవు.
Related News
Business Idea: రోజుకు రూ. 5 వేల వరకు సంపాదన.. చేయాల్సిన పని కూడా సింపులే..!
రైతులు అరటిపంట సాగు చేస్తే దానితో పాటు అరటిపొడి వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ సంపాదనను పెంచుతుంది.