Spirituality: రూపాయి బిళ్ళతో గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వారంలో గురువారం రోజున రూపాయి బిళ్ళతో ఒక పరిహారం పాటిస్తే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Mon - 23 December 24

మామూలుగా డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి. ఎంత కష్టాన్ని అయినా సరే ఇష్టంగా భావించి చేయాల్సిందే. కొన్నిసార్లు ఒళ్ళు వంచి కూడా పనిచేయాలి. అలా రాత్రి పగళ్ళు కష్టపడినప్పుడే డబ్బు సంపాదించగలం. అయితే అలా ఎంత సంపాదించినా కూడా కొన్ని కొన్ని సార్లు డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఎన్ని చేసినా కూడా డబ్బు చేతులు నిలబడదు. సంపాదించిన సంపాదన అలా ఆవిరైపోతూ ఉంటుంది. ఆ లక్ష్మీ అనుగ్రహం లేక ఇంట్లో డబ్బులు కూడా నిలువ ఉండవు. అయితే ఆ డబ్బులు నిలువ ఉండి, క్రమంగా మీ ఆస్తి పాస్తులు పెరగాలంటే కొన్ని పరిహారాలు, నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఆ చర్యలు చేపట్టడం వల్ల క్రమంగా ఆదాయం పెరుగుతుందట.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డబ్బు నిలవాలంటే గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించాలట. గురువారం రోజు పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలట. ఇలా దీపారాధన చేసే సమయంలో ఆ దీపపుకుందిలో ఒక రూపాయి బిళ్ళను ఉంచలని చెబుతున్నారు. దీపం కొండెక్కిన తర్వాత అందులోని రూపాయి బిళ్ళను తీసుకొని కొత్త బట్టతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలట. ఈ విధంగా మూడు లేదా 12 లేదా 21 గురువారాలు ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం మీపై తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. మూడు వారాలు మూడు రూపాయి బిళ్ళను తీసుకొని శుభ్రంగా తుడుచుకొని వాటిని పసుపు బట్టలో కట్టి ఆ బట్టపై పసుపు, కుంకుమ చల్లి డబ్బులు దాచే ప్రదేశంలో ఉంచాలట. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆ ప్రదేశంలో కొలువై ఉంటుందని, క్రమంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలుపుతున్నారు.
అప్పులు తీరాలంటే కొంత మందికి ఎంత సంపాదించినా డబ్బులు నిలువ ఉండదు. పైగా అప్పులు చేసుకుంటూ పోతూ వుంటారు. అలాగే కొంతమంది లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారికెప్పుడూ ఆ లోన్ కాదు, అవసరమూ తీరదు. అలాంటి వారు మంగళవారం నాడు ఈ పరిహారం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో మల్లెనూనెతో దీపారాధన చేయాలట. ఆ తరువాత నల్ల శనగల గుగ్గిళ్ళను స్వామి వారికీ నైవేద్యంగా సమర్పిస్తే ఫలితాలు పొందొచ్చని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా 9 వారాలు ఈ పరిహారం చేయాలని తప్పకుండా ఫలితం కనపడుతుందని చెబుతున్నారు. పైన చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు..