Dussehra 2024: ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు.. పూజా సమయం, తేదీ వివరాలివే!
2024 దసరా పండుగ ఎప్పుడు పూజా సమయం విధి విధానాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 01:30 PM, Tue - 1 October 24

భారతదేశంలో ఉండే హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో దసరా పండుగ కూడా ఒకటి. దాదాపు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజించి చివరగా పదవ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఇది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. నవరాత్రుల తర్వాత పదవ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు.
ఈ రోజున శ్రీరాముడు లంకా రాజు రావణుని సంహరించాడు. అంతేకాదు ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. అందుకే ఆ రోజును విజయదశమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాల్లో ఈ రోజున రావణుడి దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేస్తారు. మరి ఈ ఏడాది అనగా 2024 లో దసరా పండుగ ఎప్పుడు అన్న విషయానికి వస్తే.. ఆశ్వయుజ మాసంలో దశమి తిథి అక్టోబర్ 12 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు దశమి తిథి ముగుస్తుంది. ఇక పూజా సమయం ముహూర్తం విషయానికి వస్తే..
పంచాంగం ప్రకారం దసరా పూజ శుభ సమయం మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 వరకు ప్రారంభం అవుతుంది. దీని ప్రకారం ఈ ఏడాది పూజలకు 46 నిమిషాల సమయం ఉంటుంది. ఇక దసరా పూజ కోసం ఆవు పేడ, దీపం, అగరుబత్తీలు, పవిత్ర దారం, కుంకుమ, పసుపు, అక్షతలు, చందనం వంటి పూజా సామాగ్రి ఉండడం తప్పనిసరి. అలాగే ఈ రోజు నా శ్రీరాముడిని హనుమంతుడిని పూరించి నైవేద్యం సమర్పించడం మంచిది.
Note: ఈ కథనంలో అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.