Friday: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో అంతే సంగతులు!
శుక్రవారం రోజు పొరపాటున కూడా తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Sat - 24 May 25

హిందూ సంప్రదాయం ప్రకారం వారంలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఎలాంటి పని చేసినా శుభం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇకపోతే శుక్రవారం రోజు తెలిసి తెలియక చేసే కొన్ని రకాల పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి శుక్రవారం రోజు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది శుక్రవారం రోజు పూజ మందిరంలో ఉన్న దేవతల విగ్రహాలను పటాలను పూజలో వాడే సామాగ్రిని శుభ్రం చేసి మళ్లీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితులలోనూ ఇలాంటి పనులు చేయకూడదట. దేవుని గదిలో విగ్రహాలు పటాలను శుభ్రం చేయడానికి బుధ, గురు, ఆది, సోమవారాలు చాలా మంచి వని చెబుతున్నారు. శుక్రవారం రోజు శుభ్రపరిచే కార్యక్రమాలు మొదలుపెడితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. అదేవిధంగా శుక్రవారం రోజు ఇంట్లో పనికిరాని విరిగిపోయిన దేవతల విగ్రహాలు ఫోటోలు పగిలిన అద్దం వంటివి బయట పడేయడం లేదంటే ఏదైనా చెట్టు కింద పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం రోజు అస్సలు చేయకూడదట.
శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కానీ బయటకు పంపిస్తే దారిద్య బాధలు తప్పవని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదట. అప్పు తీసుకోకూడదట. అత్యవసరం అయితే డబ్బులు తీసుకోవడం ఇవ్వడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలని అలా కాకుండా సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ప్రధాన ద్వారం మూసి ఉంచకూడదని చెబుతున్నారు. ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి సిరిసంపదలు కోరుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలని చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు ఏవైనా శుభకార్యాలకు వెళ్ళిన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వకూడదట. శుక్రవారం మీ చేతితో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానుకగా ఇస్తే మీ ఇంటి లక్ష్మీదేవిని వేరొకరికి అందజేసినట్టే అవుతుందని చెబుతున్నారు.