Thursday: గురువారం రోజు ఈ వస్తువులు దానం చేస్తే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలగడం ఖాయం!.
విష్ణుమూర్తి అనుగ్రహం కోసం గురువారం రోజు తప్పకుండా కొన్ని రకాల వస్తువులను దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:30 AM, Thu - 31 October 24

హిందువులు భక్తిశ్రద్ధలతో కొలిచే దేవుళ్ళలో శ్రీమహావిష్ణువు కూడా ఒకరు. శ్రీ మహా విష్ణువు అనుగ్రహం ఉంటే చాలు ఎలాంటి బాధలైనా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. గురువారం రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున స్వామి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు కొన్ని వస్తువులను దానం చేయాలని పండితులు అంటున్నారు. దీనివల్ల వృత్తి నుంచి ఆర్థిక స్థితి పురోగతి వరకు ప్రయోజనాలను పొందవచ్చట.
మరి విష్ణు మూర్తి అనుగ్రహం కోసం ఎలాంటి వస్తువులు దానం చేయాలి అన్న విషయానికి వస్తే.. పసుపు రంగును శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రంగుగా భావిస్తారు. అందుకే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు ఉపవాసం ఉండి పసుపు రంగు దుస్తులు ధరించాలట. అలాగే పేదలకు ఈ రంగు దుస్తులను కూడా దానం చేయాలనీ చెబుతున్నారు. ఇది మీ జాతకంలో బృహస్పతి బలహీనమైన స్థానాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే మీరు వృత్తిలో పురోగతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే గురువారం రోజు పసుపు రంగుకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డ గురువారం పసుపు రంగును ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
అందుకే ఈ రంగులో ఉండే ఎలాంటి ఆహార పదార్థాలైన అనగా పసుపు రంగు బియ్యం, అరటి పండ్లు, మిఠాయిలు వంటి వాటిని అవసరమైన వారికి దానం చేయాలి. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా పొందుతారని పండితులు చెబుతున్నారు. కేవలం పసుపు రంగు దుస్తులు మాత్రమే కాకుండా పసుపును, పసుపు రంగు కలిగిన ధాన్యాలను అలాగే పండ్లు కాయలను దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. ఇలా గురువారం చేస్తే తప్పకుండా భక్తుల బాధలన్నింటీని విష్ణుమూర్తి పోగొడుతాడని నమ్మకం అలాగే గురువారం నాడు మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు వస్తువులను దానం చేస్తే చాలా మంచిదట. దీంతో మీ సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు.