Vastu : విజయదశమి నాడు ఎవరికీ చెప్పకుండా ఈ వస్తువులను దానం చేయండి..ధనభాగ్యం కలుగుతుంది..!!
హిందూ పురాణాల ప్రకారం దసరా పండగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్షం 10 వరోజున దసరా పండగను వైభవంగా జరుపుకుంటారు.
- Author : hashtagu
Date : 05-10-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూ పురాణాల ప్రకారం దసరా పండగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్షం 10 వరోజున దసరా పండగను వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి అక్టోబర్ 5 బుధవారం నాడు దసరా పండగను జరుపుకుంటున్నారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా సాయంత్రం రావణుని చిహ్నమైన రావణుడు దిష్టిబొమ్మను దహనం చేస్తారు. జ్యోతిష్యం ప్రకారం దసరా రోజున అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. ఇవే కాకుండా దసరా రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే శుభప్రదంగా భావిస్తారు.
దసరా రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి చాలా ప్రసన్నం అవుతుందని నమ్ముతుంటారు. దసరా రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
దసరా రోజున ఈ వస్తువులను రహస్యంగా దానం చేయండి:
చీపురు దానం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దసరా రోజున, ఒక మతపరమైన స్థలం లేదా దేవాలయానికి కొత్త చీపురును దానం చేయాలి. అలా దానం చేస్తున్నట్లుగా దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కావున దానిని దానం చేయడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి.
ఆహారం:
జ్యోతిష్యం లేదా గ్రంధం కావచ్చు.. ప్రతిదానిలో అన్నదానం గురించి చాలా చెప్పబడింది. పేదవారికి అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. దీంతో పాటు లక్ష్మిదేవితో పాటు అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
బట్టలు:
మనిషి జీవితానికి ఆహారం, నీరు ఎంత అవసరమో. అదేవిధంగా శరీరాన్ని కప్పడానికి బట్టలు చాలా అవసరం. కావున దసరా రోజున పేదవారికి బట్టలు దానం చేయండి. ఇలా దానం చేస్తున్నట్లు ఎవరితోనూ చెప్పకుండా దానం చేయండి.