Spirituality: ఇంట్లో అలాంటి హనుమంతుడి ఫోటోలు ఉన్నాయా.. వెంటనే ఇలా చేయండి!
మన ఇంట్లో కొన్ని రకాల ఆంజనేయస్వామి ఫోటోలను పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి ఫోటోలు ఇంట్లో ఉంచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:30 PM, Sun - 22 December 24

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో హనుమంతుడు కూడా ఒకరు. దాదాపుగా ప్రతి ఒక్క గ్రామంలో హనుమంతుడి ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఎన్ని ఆలయాలు ఉన్నా ఇంట్లో ఆంజనేయ స్వామి చిత్రపటం తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో ఆంజనేయస్వామి పటాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదే కానీ, కొన్ని రకాల ఆంజనేయ స్వామి ఫోటోలను ఇంట్లో అసలు పెట్టుకోకూడదట. ఇలా చేస్తే కొన్ని రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఇంట్లో ఎలాంటి ఆంజనేయ స్వామి ఫొటోస్ ని పెట్టుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాతిని చీల్చుతున్న హనుమంతుని ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదట. శ్రీరాముడి పై ఉన్న భక్తితో శ్రీరాముడు ఎప్పటికీ తన గుండెల్లో జాతిపై ఉంటాడు అని ఆ ఫోటో అర్థం. తన ఛాతీని చీల్చినప్పుడు తన గుండెల్లో రాముడు, సీత కనిపిస్తారు. అయితే ఇలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచుకోకూడదని చెప్తున్నారు. ఇలాంటి ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారట. ఈ ఫోటోతో పాటు హనుమంతుడు సంజీవిని కొండని ఎత్తుకున్న ఫోటో కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదట. లక్ష్మణుడు చనిపోయినప్పుడు హనుమంతుడు ఈ సంజీవని కొండని తీసుకొస్తారు అన్న విషయం తెలిసిందే. అలా ఆ కొండను తీసుకొస్తున్న ఫోటోని ఇంట్లో ఉంచుకోకూడదట.
ఇది అస్థిరత్వానికి నిదర్శనమని, అందుకే ఈ తరహా ఫోటోలను ఉంచుకోకూడదని చెబుతున్నారు. లంక దహనం చేస్తున్న ఫోటో సీత జాడను తెలుసుకోవడానికి హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు అక్కడ లంక దహనం చేస్తారు. అలాంటి ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదట. ఇది ప్రతికూల ప్రాభవాన్ని ఇస్తుందట. లంక దహనం మాదిరిగా ఇల్లు కూడా నాశనమవుతుందని అందుకే ఆ ఫోటోని ఎట్టి పరిస్థితులలో ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతున్నారు. రాముడు, లక్ష్మణుడిని భుజాన మోస్తున్న ఫోటోలు సీత జాడ తెలుసుకున్న తరువాత సీతను రక్షించేందుకు హనుమంతుడు రాముడు, లక్ష్మణుడిని తన భుజాలపై ఎత్తుకొని తీసుకెళ్తారు. ఇలాంటి ఫోటోలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదని, ఇలా ఉంచడం వల్ల యజమానిపై భారం ఎక్కువగా పడుతుందని, అలాగే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇలాంటి ఫోటోలు కాకుండా మిగతా ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చని చెబుతున్నారు.