Karthika Masam: కార్తీకమాసంలో ఇలా చేస్తే చాలు.. మూడు జన్మల పాపాలు తొలగి పోతాయట!
కార్తీక మాసంలో బిల్వపత్రాలతో పరమేశ్వరుని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయట.
- By Anshu Published Date - 12:02 PM, Fri - 8 November 24

కార్తీకమాసం వచ్చింది అంటే చాలు ఆలయాలు అన్నీ కూడా దీప కాంతులతో పండగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా పరమేశ్వరుడి అలాగే శ్రీమహావిష్ణువు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో పాటు దీపాల వెలుగులతో ఆలయాలు వెలిగిపోతూ ఉంటాయి. అలాగే చాలామంది ఈ కార్తీకమాసంలో నది స్నానాలను ఆచరించి ఇంట్లో అలాగే దేవాలయాలలో కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే రావి చెట్టు కింద కూడా కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
ఇకపోతే కార్తీకమాసంలో ఇప్పుడు చెప్పబోయే పనిచేస్తే చాలట. ఏకంగా మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు. మరి అందుకోసం కార్తీక మాసంలో ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఎక్కువగా పూజిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన బిల్వపత్రాలతో పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయట. వీటినే మారేడు దళాలు అని కూడా పిలుస్తారు. అయితే కార్తీక మాసంలో ఈ బిల్వ పత్రాలతో శివుడ్ని పూజిస్తే మూడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది.
సాధారణంగా కాడ లేని పుష్పాలు, కాయలు, ఆకులు మాత్రమే పూజకు వినియోగిస్తాం. కానీ బిల్వ పత్రాలను కాడతోనే సేకరించి శివారాధన చేస్తేనే ఈ శుభ ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కార్తిక మాసంలో బిల్వపత్రాలను సేకరించి ఆ పరమేశ్వరుడికి సమర్పించి మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే తొలగించుకోండి.