Palmistry: అరచేయి దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయి అన్న విషయాల గురించి పండితులు తెలిపారు.
- By Anshu Published Date - 04:00 PM, Tue - 13 August 24

అరచేయి దురద పెడుతోంది అంటే చాలు చాలామంది డబ్బులు రాబోతున్నాయి డబ్బులు చేతికి అందుతాయని అంటూ ఉంటారు. కొంతమంది ఏమో డబ్బులు నష్టపోతున్నారు ఎక్కువగా ఖర్చు పెట్టబోతున్నారని అంటూ ఉంటారు. అలాగే అరికాలు దురద పెడితే ప్రయాణం చేయబోతున్నారని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. మరి నిజంగానే ఇవన్నీ నిజంగా జరుగుతాయా? ఇందులో నిజం ఎంత? వీటి గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా సాముద్రిక హస్త శాస్త్రం ప్రకారం అరచేతులు దురద పెడితే డబ్బులు లభిస్తాయట.
అయితే పురుషులు, స్త్రీలు ఒక్కొకరికి భిన్నమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కాగా పురుషులకు కుడి అరచెయ్యి దురద పెడితే అది శుభవార్తకు సంకేతంగా భావించాలట. త్వరలో వీరికి చేతికి డబ్బు అందబోతుంది అనే దానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇది మనసుకు చాలా సంతృప్తిని ఇస్తుంది. డబ్బు ప్రవేశాన్ని సూచిస్తుంది. అలాగే ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు రావడం వల్ల ఆనందంగా ఉంటారు అనే దానికి ఇది ఒక సంకేతంగా భావించాలి. అలాగే గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందబోతుందని అర్థం. ఒకవేళ ఎడమ అరచెయ్యి దురద పెడితే మీ డబ్బు చేతి నుంచి జారిపోతుందని అర్థం.
ఆర్థికంగా నష్టపోయే సూచనను ఇది తెలియజేస్తుంది. దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఊహించని విధంగా ఖర్చులు రావడం వల్ల డబ్బు కోల్పోతారు. అప్పుల పాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందట. పురుషులకు ఎడమ అరచెయ్యి దురద పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెప్పేందుకు ఇదొక సంకేతం. పురుషులకు మాదిరిగానే స్త్రీలకు కూడా కుడి అరచెయ్యి దురద పెడితే అదృష్టమే. ఆర్థికంగా భారీగా లాభపడబోతున్నారని దీని అర్థం. అధిక సంపద కలుగుతుంది. అన్ని వైపుల నుంచి డబ్బు చేతికి అందుతుంది. శ్రేయస్సు, విజయం లభిస్తుంది అనే దానికి ఇదొక సంకేతంగా భావిస్తారు. కాగా స్త్రీలకు కుడి అరచేతిలో దురద పెడితే అపశకునంగానే భావిస్తారు. మీ అదృష్టం చేజారిపోతుంది అనే దానికి ఇదొక సంకేతంగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అలాగే దురద పెడుతుందని అదే పనిగా రుద్దడం మంచిది కాదట. ఇది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడాన్ని సూచిస్తుంది.