HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Do You Take Too Much Tension On Everything Neem Karoli Baba Had Given This Mantra

Neem Karoli Baba Tips: జీవితంలో చింతల నుంచి విముక్తికి.. నీమ్ కరోలి బాబా చెప్పిన రహస్యాలు..!

మీరు ప్రతి విషయంలోనూ ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? జీవితంలో చింతల నుంచి విముక్తి పొందాలా? అయితే నీమ్ కరోలి బాబా చెప్పిన ఒక విలువైన మంత్రం గురించి తెలుసుకోండి.

  • By Gopichand Published Date - 02:39 PM, Thu - 9 February 23
  • daily-hunt
Neem Karoli Baba Tips
Resizeimagesize (1280 X 720) (3) 11zon

మీరు ప్రతి విషయంలోనూ ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? జీవితంలో చింతల నుంచి విముక్తి పొందాలా? అయితే నీమ్ కరోలి బాబా చెప్పిన ఒక విలువైన మంత్రం గురించి తెలుసుకోండి.

నీమ్ కరోలి బాబాను దైవిక వ్యక్తిగా ప్రజలు భావించేవారు. ఆయనను హనుమంతుని అవతారంగా కూడా అనుకునే వారు. బాబా ఎల్లప్పుడూ ఇతరులకు సేవ చేయడానికే ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు. మానవ సేవ అనేది భగవంతునికి భక్తునికి మధ్య ఉత్తమ మాధ్యమం అని భావించే వారు. జీవితంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను నీమ్ కరోలి బాబా చెప్పారు.

నీమ్ కరోలి బాబాను అద్భుత బాబాలలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ గ్రామంలో 1900 ప్రాంతంలో జన్మించాడు. ఆయన భక్తులు ఆయనను హనుమంతుని అవతారంగా భావిస్తారు. ఆయన సాధారణ వ్యక్తి. ఆయన భక్తి యోగం ద్వారా భగవంతుడిని పూజించేవారని అంటారు.   జీవితంలో ఎక్కువ ఇబ్బందులు పడే వారి కోసం నీమ్ కరోలి బాబా కొన్ని ప్రత్యేక విషయాలను చెప్పారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* కేవలం దేవుడిని ప్రార్థించండి.

* మనిషి తన చింతలను ఎప్పటికీ ముగించలేడని నీమ్ కరోలి బాబా అన్నారు. దీనికి కారణం ఒకవైపు మనిషి దేవుణ్ణి నమ్ముతూనే.. మరోవైపు తన కష్టాలు ఎప్పటికైనా తీరతాయా అని కూడా అనుకోవడం.

*  దేవుణ్ణి నమ్మేవాడూ, చింతించేవాడూ ఇద్దరూ ఒకే మనసులో కూర్చోలేరు. మీరు దేవుణ్ణి విశ్వసిస్తే మీరు చింతించాల్సిన అవసరం లేదని అర్థం. ఒకవేళ మీరు చింతిస్తే దేవుణ్ణి పూర్తిగా నమ్మరని అర్ధం.

*మనిషి ఏదో తెచ్చుకోవడానికి వెళ్తాడు. కానీ ఏదో ఒకదానితో తిరిగి వస్తాడని బాబా చెప్పేవారు.

* మనం పని చేస్తాం. కానీ మనం దేవునికి ఏ ప్రార్థనలు చేస్తామో, అది కూడా చాలా ముఖ్యం అని బాబా అనేవారు.

*  కానీ జీవితంలో మనం కోరుకున్నది మనకు ఎల్లప్పుడూ లభిస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు.

* భగవంతుడు ఏది చేసినా అది అందరి మేలు కోసమే అని బాబా చెప్పేవారు.

* ఒక్కోసారి మనం దేవుడిని అడిగినవి పొందడం కూడా జరుగుతుంది. కానీ కోరిక తీరకపోతే దేవుడు మనకోసం ఇంకేదో ఆలోచించాడని అర్థం.

* మనిషి ఇంకేదైనా కోరుకుంటాడు కానీ వేరొకటి పొందుతాడు అని బాబా చెప్పేవారు.

* మన కర్మలు చెడ్డవి కానట్లయితే, మనకు కూడా ఊహించని విధంగా మంచి ఫలితం లభిస్తుంది.

* మన కర్మలు చెడుగా ఉంటే లేదా మనం ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తున్నామో, దాని ప్రకారం మనకు ఫలం వస్తుంది అని బాబా చెప్పారు.

* కర్మలను బట్టి మనుషులు ఫలితం పొందుతారు.

* ఒక వ్యక్తి ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించకూడదని బాబా అనేవారు.దీనికి బదులుగా మీరు మీ పనులపై గరిష్ట శ్రద్ధ వహించాలి.

*  మంచి పనులతో పాటు తెలిసి, తెలియక కొన్ని తప్పుడు పనులు చేస్తే మిశ్రమ ఫలితాలు వస్తాయి. అందుకే అస్సలు చింతించకండి, ఆలోచనపై, మీ పనిపై దృష్టి పెట్టండి అని బాబా అన్నారు.

* చింత మరియు ధ్యానం యొక్క అర్థం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మూర్ఖులు చింతిస్తారు. చింతించడం మన పని కాదు. మన పనులు చక్కగా చేయడమే మన పని. ఎల్లప్పుడూ ప్రతి పనిలో మీ బెస్ట్ ఎఫర్ట్ పెట్టండి అని బాబా అనేవారు.

* మీరు జీవితంలో ఏదైనా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, దానిలో కూడా అన్ని పనులను చక్కగా చేయండి. ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి ఆ పని చేయండి అన్నారు.

*  పని చేసిన తరువాత, దాని గురించి అస్సలు చింతించకండి. దానిని దేవునికి వదిలివేయండి అని బాబా అన్నారు.

* సానుకూల ఫలితమే వస్తుందని నమ్మండి. చింతించకండి.. ఆందోళన నుండి బయటపడటానికి ఇదే అతిపెద్ద నియమం.

* మనిషి తన మనసును గాయపరిచే ఉద్దేశాలను మనస్సులో సృష్టించుకోకూడదని బాబా చెప్పేవారు.

* మీరు ఏదైనా పని చేసినప్పుడు మీ మనస్సులో ఒక ఉద్దేశ్యాన్ని ఏర్పరచుకోండి. మీరు కష్టపడి పనిచేసినప్పుడు పనిలో సానుకూల ఫలితాలు సాధించబడతాయి. ప్రతికూలతకు దూరంగా ఉండండి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Neem Karoli Baba
  • Neem Karoli Baba Tips
  • Neem Karoli Baba Tips in Telugu

Related News

    Latest News

    • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

    • CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

    • Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

    • Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

    • Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

    Trending News

      • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

      • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

      • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

      • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

      • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd