Diwali Lamps Count : దీపావళి, ఛోటీ దీపావళి, ధన్ తేరస్.. ఏయే రోజు ఎన్నెన్ని దీపాలు వెలిగించాలి ?
Diwali Lamps Count : దీపావళి, ఛోటీ దీపావళి(నరక చతుర్దశి), ధన్ తేరస్(ధన త్రయోదశి) తేేేదీలలో దీపాలను వెలిగిస్తుంటారు.
- By Pasha Published Date - 11:05 AM, Wed - 8 November 23
Diwali Lamps Count : దీపావళి, ఛోటీ దీపావళి(నరక చతుర్దశి), ధన్ తేరస్(ధన త్రయోదశి) తేేేదీలలో దీపాలను వెలిగిస్తుంటారు. అయితే ఏ రోజున ఎన్ని దీపాలను వెలిగించాలనే సందేహం చాలామందికి వస్తుంటుంది. పండితులు చెబుతున్న ప్రకారం ఆవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధన త్రయోదశి
ఈ ఏడాది నవంబర్ 10న(శుక్రవారం) ధన త్రయోదశి పండుగను మనం జరుపుకోనున్నాం. ధన్ తేరస్ పూజకు సాయంత్రం 5:26 గంటల నుంచి సాయంత్రం 7:22 గంటల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, లక్ష్మీ గణేశుని విగ్రహాలు, కొత్త చీపురు, ఉప్పు ప్యాకెట్ వంటివి కొనడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ధన్తేరస్ రోజున 13 దీపాలను వెలిగించాలి. వీటిని ఇంటి ప్రవేశద్వారం, వంటగది, పూజ గది వంటి ప్లేస్‌లలో ఉంచాలి. తలుపు వద్ద ఉంచిన దీపం అతిథులను స్వాగతించడంతో పాటు ఇంటికి శ్రేయస్సును సూచిస్తుంది. వంటగదిలో ఉంచిన దీపం సమృద్ధిగా ఆహారం, మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పూజ గదిలో ఉంచిన దీపం భగవంతుని ఆరాధన, ఆశీస్సులను సూచిస్తుంది.
నరక చతుర్దశి
ఈ ఏడాది నవంబర్ 11న(శనివారం) ఛోటీ దీపావళి(నరక చతుర్దశి) జరుపుకుంటాం. ఈ రోజున లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, కాళీ అమ్మవారిని పూజిస్తారు. నరక చతుర్దశి రోజున దీపాలను వెలిగించడం వల్ల ఆ దీపాలు యమ లోకంలో ఉన్న పెద్దలకు నరకం నుంచి విముక్తి కల్పిస్తాయని చెబుతారు. యమ లోకంలో మొత్తం 84 లక్షల నరకాలుంటాయని, వాటి నుంచి విముక్తి పొందేందుకు ఈ దీపారాధన ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఛోటీ దీపావళి నాడు 14 దీపాలను వెలిగించాలి. అంచు చుట్టూ 11 దీపాలు, మధ్యలో నాలుగు ముఖాల దీపాలతో ఒక ప్లేట్లో ఉంచాలి. ముందుగా నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత మిగిలిన 11 దీపాలను వెలిగించాలి. కొందరు వ్యక్తులు సంపన్నమైన జీవితం కోసం వారి కోరికకు ప్రతీకగా పంచదార లేదా ఇతర స్వీట్లను కూడా దీపాలకు జోడిస్తారు.
దీపావళి
ఈ ఏడాది నవంబర్ 12న(ఆదివారం) దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున సాయంత్రం 5:18 గంటల నుంచి 7:14 గంటల వరకు అమ్మవారికి పూజలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. దీపావళి వేళ శారద పూజ, కాళీ పూజలు నిర్వహిస్తారు. శారదా పూజను సాయంత్రం 5:08 గంటల నుంచి రాత్రి 10:03 గంటల మధ్య నిర్వహిస్తారు. కాళీమాత పూజను తెల్లవారుజామున 4:36 గంటల నుంచి ఉదయం 6:14 గంటల మధ్య నిర్వహించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.దీపావళి రోజున ఇల్లు మొత్తం దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలనే లెక్క ఏమీ లేదు. కొంతమంది వారి వ్యక్తిగత ప్రాధాన్యతలు, సంప్రదాయాలను బట్టి ఎక్కువ లేదా తక్కువ దీపాలను(Diwali Lamps Count) వెలిగిస్తుంటారు.
Related News
Vijay Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్? మరోసారి దొరికేశారు..
దీపావళి సందర్భంగా విజయ్ దివాళీ(Diwali) సెలెబ్రేషన్ కి సంబంధించి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక రష్మిక కూడా ఒక ఫొటో షేర్ చేసి దీపావళి విషెష్ చెప్పింది.