HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know About Medicine In Astrology

Medicine in Astrology: జ్యోతిష్యంలో వైద్యం గురించి తెలుసా..!

మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం. ఆ రుగ్మతలకు కూడా రాశులు, వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు, గ్రహకార కత్వాల ద్వారా..

  • By Maheswara Rao Nadella Published Date - 04:00 PM, Fri - 31 March 23
  • daily-hunt
Do You Know About Medicine In Astrology..!
Do You Know About Medicine In Astrology..!

Medicine in Astrology : మానవుని జీవితంలో రుగ్మతలు సర్వ సాధారణం. ఆ రుగ్మతలకు కూడా రాశులు, వాటి అధిపతులైన గ్రహాలూ కారణం అవుతాయి. రాసి తత్వాలు, గ్రహకార కత్వాల ద్వారా రోగ నిర్ధారణకు ఉపకరించేదే వైద్య జ్యోతిషం (Medicine in Astrology). ఏ శరెర భాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలుపుతాయి. ఎటువంటి రుగ్మతలు వస్తాయో గ్రహాల ద్వారా తెలుస్తుంది. ముందుగా రాశులు – వాటికి వర్తించే శరీర భాగాలు ఈ దిగువన వివరిస్తున్నాం.

రాశులు – శరీర భాగాలు:

మేషం – శిరస్సు ,ముఖం, మెదడు , ముఖంలోని ఎముకలు, మెదడు లోని నరాలు.
వృషభం – గొంతు, మెడ, వాటిలోని నరాలు,ఎముకలు.
మిధునం – భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాస కోశం .
కర్కాటకం – రొమ్ము ,జీర్ణాశయం.
సింహం – గుండె , వెన్నెముక
కన్య – ఉదరం, ఉదరకోశం,పొత్తికడుపు
తుల – కటి భాగం, నాభి, మూత్ర పిండాలు.
వృశ్చికం – జననేంద్రియాలు, మూత్రకోశం .
ధనుస్సు – తొడలు, పిరుదులు, రక్త నాళాలు.
మకరం – మోకాళ్ళు, కీళ్ళు.
కుంభం – పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణం.
మీనం – పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్దాలు.

ఈ రాశులలో మేష, సింహ, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభ, కన్య, మకరాలు భూతత్వానికి, మిధున , తుల, కుంభ రాశులు వాయు తత్వానికి , కర్కాటక, వృశ్చిక, మీన రాశులు జల తత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబందించిన రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణం అవుతాయి. గ్రహాలు ఆ కలుగ చేసే రుగ్మతల వివరాలు ఈ క్రింద పొందు పరచినాము.

గ్రహాలు – రుగ్మతలు:

సూర్యుడు – హృదయ, నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత, పురుషులకు కుడి కన్ను, మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు – ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు – జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ, చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు, మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు – జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు – నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు, ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు – కాలేయం, మధుమేహం,రక్త నాళాలు, కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని – దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
ఇంద్ర – రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
వరుణ – మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం, అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
యమ – వంశ పారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు, మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న, సూర్య, చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు.

లగ్న రాశి నుంచి గాని, సూర్య రాశి నుంచి గాని, చంద్ర రాశి నుంచి గాని 6, 8, 12 స్థానాలు అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు, ఆ రాశి అధిపతులు, ఆ రాశిలో వున్నా గ్రహాలూ, కారకత్వాలను తెలుసు కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.

Also Read:  Kazipet: శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయం.. వరంగల్ జిల్లా: కాజీపేట


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • devotional
  • god
  • medicine

Related News

TTD

TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

  • TTD Calendars

    TTD Calendars: తిరుమ‌ల భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!

  • Mobile Wallpaper

    Mobile Wallpaper: మీ ఫోన్ వాల్‌పేప‌ర్‌గా దేవుడి ఫొటో పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd