Vastu Tips : మీ పూజగదిలో రాగిచెంబు ఉంచి…దాంతో ఇలా చేయండి..కష్టాల నుంచి గట్టేక్కడం ఖాయం..!!
మీ కష్టాలు తీరడం లేదా.? సమస్యలకు పరిష్కారం దొరకడం లేదా? ఆర్థిక, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా?
- Author : hashtagu
Date : 03-09-2022 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
మీ కష్టాలు తీరడం లేదా.? సమస్యలకు పరిష్కారం దొరకడం లేదా? ఆర్థిక, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంట్లోని పూజాగదిలో రాగి చెంబును ఉంచి ఈ విధంగా చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
పూజగదిలోదేవుడి చిత్రపటాల వదద రాగిచెంబును ఉంచి…అందులో శుభ్రమైన గంగాజలాన్ని నింపాలి. ఆ గంగాజలంలో రెండు పువ్వులు వేయాలి. ఇలా నీటతో పూజ చేసినట్లయితే సర్వదేవతలు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతున్నారు. నీటిని దేవుళ్లు నైవేద్యంగా స్వీకరిస్తారు. మహానైవేద్యంగా భావిస్తారు. అందుకే పూజాగదిలో రాగిచెంబులో కానీ వెండి చెంబులో కానీ నీరు పోసి పూజచేస్తే సకలదేవతల ఆశీస్సులు పొందుతారు. వారిచ్చే వరాలను అనుగ్రహిస్తారు. దీంతో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.
రాగిచెంబులో గంగాజలాన్నీ పోసి పూజ చేసిన అనంతరం…ఈ నీటిని ఇంటిల్లిపాది సేవించాలి. దీంతో సమస్త దోషాలు తొలగిపోయి…ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అందరూ సేవించిన తర్వాత మిగిలిన జలాన్ని కిందపోయకూడదు. మీ ఇంట్లో ఉన్న మొక్కలకు ఆ నీటిని పోయాలి. ప్రతిరోజూ పూజ చేస్తే…ఏరోజుకారోజు పూజకు శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ పోయి..ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.