Wednesday: బుధవారం ఇలా చేస్తే చాలు విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం!
బుధవారం రోజున రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందట.
- By Nakshatra Published Date - 01:00 PM, Tue - 3 September 24
మనం ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా మొదట విగ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత ఆ పనులను ప్రారంభిస్తూ ఉంటాం. మొదట విగ్నేశ్వరుడిని పూజించడం వల్ల మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవని నమ్ముతూ ఉంటారు. అలాంటి విగ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే కొన్ని రకాల పరిహారాలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా వారంలో బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈరోజున కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆ గణేశుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం బుధవారం ఎలాంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే..
బుధవారం రోజు ఉదయం తలస్నానం చేసి ధాన్యం చేయాలి. తర్వాత వినాయకుడిని పూజించాలి. కాగా పూజా సమయంలో బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించాలట. బెల్లంతో చేసిన మోదకాలను వినాయకుడికి సమర్పించడం వల్ల గజానుడికి త్వరగా సంతోషం కలుగుతుందట. ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. బెల్లంతో చేసిన మోదకాన్ని వినాయకుడికి సమర్పించడం వల్ల కోరిన కోరికలు కూడా నెరవేరుతాయట. అదేవిధంగా జమ్మి ఆకు అంటే గణపతికి ఎంతో ఇష్టం. కాబట్టి బుధవారం రోజు పూజ సమయంలో వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించడం మంచిది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం బుధవారం గంగాజలంతో స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలట.
ఆ తర్వాత కుంకుమపువ్వు పాలతో వినాయకుడికీ అభిషేకం చేయాలట. కుంకుమపువ్వు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనదని, ఈ పరిహారం పాటిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. వినాయకుడికి దర్భ అంటే కూడా చాలా ఇష్టం. దీనిని చాలా మంది దుర్వ అని కూడా పిలుస్తారు. అయితే విఘ్నేశ్వరుడు అనుగ్రహం కోసం బుధవారం రోజు 21 దుర్వలను దారంలో కట్టి వినాయకుడికి సమర్పించాలి. ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదట. ఆర్థికపరమైన సమస్యలు అన్ని దూరం అవుతాయని చెబుతున్నారు.
Related News
Lord Ganesh: వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా?
వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ వెనుక పెద్ద కథే ఉందట.