Thursday: గురువారం రోజు ఇలా చేస్తే చాలు.. వ్యాపారంలో లాభాలే లాభాలు!
వ్యాపారంలో లాభాలు కావాలి, బిజినెస్ బాగా జరగాలి అనుకున్న వారు గురువారం రోజు తప్పకుండా కొన్ని రెమెడీలను పాటించాలని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 09:34 AM, Thu - 6 March 25

గురువారం రోజు బృహస్పతిని అలాగే దత్తాత్రేయుడిని, సాయిబాబాను ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బృహస్పతిని సంపదకు కారకంగా కూడా వర్ణిస్తారు. జాతకంలో బృహస్పతి వల్ల వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయని చెబుతారు. గృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడే జీవితంలో డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి అలాంటప్పుడు జాతకంలో బృహస్పతి గృహాన్ని బలోపేతం చేయాలని పండితులు చెబుతున్నారు. విష్ణువును, బృహస్పతిని గురువారం రోజు పూజిస్తారు. ఈ రోజు వివాహిత, అవివాహిత స్త్రీలు ఉపవాసం కూడా ఉంటారు.
అయితే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో లాభాలు రావాలి అంటే గురువారం రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బృహస్పతి సంపద ఉన్న ఇంట్లో కూర్చోవడం లేదా జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల ఆ వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడట. మీ వ్యాపారం లాభాల్లో సాగాలి అనుకుంటే గురువారం రోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించాలని చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఏకశిలా కొబ్బరికాయను సమర్పించాలట. వ్యాపారంలో వృద్ధి రావాలని దేవుళ్లను వేడుకోవాలని చెబుతున్నారు.
కాగా మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే గురువారం నాడు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేయాలట. ఆ తర్వాత పచ్చి పాలలో కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తికి దక్షిణ శంఖంతో అభిషేకం చేయాలనీ చెబుతున్నారు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చట. ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చట. కెరియర్లో మంచి సక్సెస్ సాధించాలి అనుకున్న వారు గురువారం రోజు విష్ణుమూర్తి ని పూజించాలట. పూజా సమయంలో గురు కవచాన్ని పఠించాలని చెబుతున్నారు. ఈ పరిహారాన్ని కనీసం 16 గురువారం అయినా చేయాలని ఇలా చేస్తే కెరియర్ లో మంచి పురోగతి కనిపిస్తుందని చెబుతున్నారు. వివాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే గురువారం రోజు తలస్నానం చేసి ధ్యానం చేయాలట. ఆ తర్వాత నీటిలో పసుపు వేసి అరటి మొక్కకు ఆరోగ్య సమర్పించాలని ఎలా ప్రతి గురువారం చేస్తే ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోయి త్వరలో ఫిక్స్ అవుతుంది అని చెబుతున్నారు.