Sunday: ఇకపై ఆదివారం అలాంటి పనులు అస్సలు చేయకండి.. లేదంటే?
వాస్తు శాస్త్ర ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం హిందువులు ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. వారంలో ఏడు
- By Nakshatra Published Date - 06:00 AM, Sun - 5 March 23

వాస్తు శాస్త్ర ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం హిందువులు ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. వారంలో ఏడు రోజులు ఉంటే ఏడు రోజులలో ఒక్కోరోజు ఒక్కో దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కొన్నివారాలలో కొన్ని రకాల పనులు చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే ఆదివారం కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. మరి ఆదివారం ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారానికి మూలం ఆధిదేవత. ఆ ఆది దేవుడు అయిన.సూర్యుడు మనకు కంటి ముందు కన్పించే దేవుడు సూర్య భగవానుడు.
నవగ్రహల్లో మధ్యలో సూర్యడు ఉంటాడు. అలాంటి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం కొన్ని పనులు చేయకూడదు. నవ గ్రహాల్లో సూర్యుడు అత్యంత శక్తి కలిగిన గ్రహం. ఆదివారం సెలవు దినం కావడం వల్ల మనలో చాలా మంది ఆదివారం అన్ని పనులు చేసుకున్నటుంటారు. మిగిలిన రోజుల్లో చేయలేని పనులు కూడా ఆ రోజే చేసేస్తూ ఉంటారు. ఆదివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు. అలా చేయడం వల్ల అనేక దోషాలు కలుగుతాయి. అదేవిధంగా మధ్యం, మాంసం వంటివి అసలు ముట్టుకోకూడదు. ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారం తినడం, పార్టీల పేరుతో మధ్యం తాగడం లాంటివి చేస్తుంటారు.
అలా మద్యం సేవించి, మాంసాహారం తినడం వల్ల అనేక దోషాలు కలుగుతాయి. కొంతమంది ఆదివారం వంటల్లో ఉప్పును సరిగ్గా వేయకూడదు ఆలాచేస్తే సూర్యుడు ప్రీతి పాత్రుడు అవుతాడని నమ్ముతారు. అలాగే ఆదివారం పెళ్ళైన భార్య, భర్తలు రతీకి దూరంగా ఉండాలి. వీలు అయితే ఇద్దరు విడివిడిగా పడుకోవడం మంచిది. అదేవిధంగా ఆదివారం రోజు నూనెతో తయారు చేసిన పధార్ధాలను తినకూడదు. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. అలా చేయడం వల్ల సూర్యుడు బాగా సంతోషపడతాడు. అందుకే సూర్యుణ్ణి అలంకార ప్రియుడు అనికూడా పిలుస్తూ ఉంటారు. మనం రెండు చేతులు జోడించి సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల సూర్యుడు చాలా ఆనందపడతాడు. ఫలితంగా మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు.

Related News

Health Tips: కూల్ డ్రింక్స్, మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. తినే