HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do Not Make This Mistake When Making An Offering To God

Naivedhyam : మీ ఇష్టదైవానికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!!

భారతీయులు...దైవపూజలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతిఒక్కరి ఇంట్లో దైవానికి పూజలు నిర్వహిస్తుంటారు. తమకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తుంటారు. దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం అనేది హిందూ సంప్రదాయంలో అందరికీ అలవాటే.

  • By hashtagu Published Date - 07:17 AM, Sun - 26 June 22
  • daily-hunt
Prasadam
Prasadam

భారతీయులు…దైవపూజలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ప్రతిఒక్కరి ఇంట్లో దైవానికి పూజలు నిర్వహిస్తుంటారు. తమకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తుంటారు. దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం అనేది హిందూ సంప్రదాయంలో అందరికీ అలవాటే. ఆ ప్రసాదాన్నే పదిమందికి పంచిపెడతారు. కళ్లకు అద్దుకుని మరీ తింటారు. అంటే మనం నైవేద్యంగా పెట్టినవి దేవుడు తింటున్నాడని మనం నమ్ముతుంటాం. అయితే ఇలా దేవుడికి ప్రసాదం సమర్పించేటప్పడు చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నైవేద్యం సమర్పించే విషయంలో కొన్నినియమాలు ఉంటాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. అందరికీ తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. నైవేద్యం సమర్పించే టప్పుడు భక్తులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రసాదం తయారీలో నూనె:
దేవుడికి సమర్పించే నైవేద్యాలను చాలా మంది నూనెతో తయారు చేస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దేవుడికి నెయ్యితోనే చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మిరపకాయలతో కూడిన వస్తువులను దేవుడికి ప్రసాదం అస్సలు పెట్టకూడదు. ఈ పొరపాటు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందట. కాబట్టి ప్రసాదం తయారీకి ఎప్పుడూ నెయ్యినే ఉపయోగించాలి.

ఈ తప్పు అస్సలు చేయవద్దు:
దేవుడికి భక్తితో నైవేద్యం సమర్పిస్తారు. అయితే కొన్నిసమయాల్లో దేవుడికి ఆహారపదార్థాలను నైవేద్యంగా సమర్పించి…వాటిని అక్కడి నుంచి తీసి తింటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…భగవంతుని ముందున్న నైవేద్యాన్ని అలా వెంటనే తొలగించడం అశుభం. ఆహారపదార్థాలను పండ్లను ఇలా ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించినా…అక్కడి నుంచి వెళ్లాలి…కొంత సమయం తర్వాత దేవునికి నమస్కరిస్తూ…భగవంతుని ముందు నుంచి నైవేద్యంగా సమర్పించిన వస్తువులను తీసుకోవాలి.

తులసిని సమర్పించవద్దు:
శివునికి పూజలు చేసేటప్పుడు తులసి ఆకులను సమర్పించకూడదు. తులసి ఆకులను శివుడికి వినాయకుడికి సమర్పించకూడదని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా బిల్వ పత్రాలను సమర్పించాలి. అదే సమయంలో గణేశుడికి దర్బలను సమర్పించాలి.

ఆవుకు ఆహారం:
శుభ్రంగా వండిన ఆహారాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి. ఆ ఆహారాన్నిదేవుడికి సమర్పించిన తర్వాత మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు . కానీ ముందుగానే ఆ ప్రసాదాన్ని ఆవుకు పెట్టినట్లయితే మేలు జరుగుతుంది. ఆవుకు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ఆవుకు ఆహారం అందించడం వల్ల సమస్త దేవతలు సంతోషిస్తారు. ఆ దేవతల అనుగ్రహం భక్తులపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • Naivedhyam

Related News

Lord Shiva Vishnu

Kartik Purnima : నవంబర్‌ 1 పవిత్రమైన దేవుత్తని ఏకాదశి.. కార్తీక మాసం!

నవంబర్ 1వ తేదీ దేవుత్తని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని విశ్వాసం. ఈరోజు నుంచే శుభకార్యాలు ప్రారంభమవుతాయట. ఇందుకు ఆరంభ సూచకంగా మరుసటి రోజు నవంబర్‌ 2న తులసి వివాహం చేస్తారు. చాలా మంది ఉపవాస దీక్ష కూడా ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన పుణ్యఫలం ఉంటుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో దేవుత్తని ఏకా

  • Koti Somavaram

    Karthika Masam : కోటి సోమవారం .. శ్రవణ నక్షత్రం విశిష్టత.!

  • Dev Deepawali

    Dev Deepawali: కార్తీక పూర్ణిమ, దేవ దీపావళి ఏ రోజు? ఎన్ని దీపాలు వెలిగిస్తే మంచిది?

Latest News

  • Hotel : వామ్మో .. ఆ హోటల్లో ఒకరాత్రి బస ఖర్చు రూ. 88 లక్షలు

  • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

  • Bihar Elections : బిహార్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే – JVC సర్వే

  • UPI Payments: పండుగ సీజన్‌లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!

  • Telangana : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టండి ..కెనడా హై కమిషనర్ ను కోరిన సీఎం రేవంత్

Trending News

    • KK Survey: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!

    • Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగ‌ల‌దా?

    • Gold- Silver: బంగారం, వెండి వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌!

    • Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

    • Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd