Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెట్టకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
Vastu Tips: పూజా గదిలో అగ్గిపెట్టె పెట్టవచ్చా, పెట్టకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sat - 11 October 25

Vastu Tips: మాములుగా మనం పూజ గదిలో రకరకాల వస్తువులను, పూజా సామాగ్రిని ఉంచుతూ ఉంటాము. అయితే పూజకు ఉపయోగించే వస్తువులను మనం ఏ ప్రదేశంలో ఉంచుతున్నాము a అనేది కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు. వాటి స్థానాన్ని మార్చడం వల్ల కూడా జీవితంలో మార్పుల వస్తాయని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఆ పూజ గదిలో ఉంచే ప్రతి వస్తువును చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి వస్తువుకీ ప్రాముఖ్యత కూడా ఉంటుంది.
ధూపం, దీపం, అగరబత్తి, అగ్గి పుల్లలను పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటితో కూడా వాస్తు శాస్త్రానికి సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా అగ్గి పెట్టను పూజ గదిలో సరైన స్థానంలో ఉంచాలట. లేకపోతే సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. మరీ ఇంతకీ అగ్గి పెట్టే విషయంలో ఎలాంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అగ్గిపుల్లలను పూజ సమయంలో దీపం వెలిగించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే అగ్గిపెట్టెను సరైన స్థలంలో ఉంచాలి. అప్పుడే మీరు అగ్ని మూలాన్ని నియంత్రించగలుగుతారట.
పూజ కోసం ఉపయోగించే అగ్గిపెట్టను పూజకు మాత్రమే ఉపయోగించాలట. దానిని పూజ సామాన్లు ఉంచే ప్రదేశంలో మాత్రమే ఉంచాలని, ఇతర అవసరాల కోసం, ఇతర ప్రదేశాల్లో దానిని ఉంచకూడదని చెబుతున్నారు. అదేవిధంగా కిచెన్ గ్యాస్ లేదా స్టవ్ నిప్పు ప్రదేశంగా పరిగణిస్తారు. పూజ కోసం వాడే అగ్గి పెట్టెను కిచెన్ లో ఉంచడం అస్థిర వాతావరణాన్ని సృష్టిస్తుందట. అందుకే పూజ కోసం వాడే అగ్గిపెట్టెను పూజ స్థలంలో మాత్రమే ఉంచడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. దానిని మరెక్కడైనా ఉంచడం వల్ల మీ జీవితంలో అస్థిరత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. నిద్ర, శాంతి అవసరమైన ప్రదేశంలో పూజ వస్తువులను ఉంచడం వల్ల శక్తి సమతుల్యత దెబ్బతింటుందట. ఇది ఒత్తిడి, అశాంతిని పెంచుతుందట. కాబట్టి, బెడ్‌రూమ్ లో అగ్గిపెట్టెలను తీసుకెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అది మీ జీవితంలో శాంతిని కాపాడుతుందట. పూజలో ఉపయోగించే వస్తువులు ఎంత పవిత్రంగా ఉంటే, వాటిని సరిగ్గా ఉపయోగించడం, సరైన స్థలంలో ఉంచడం అంత ముఖ్యం. చిన్న అజాగ్రత్త వాస్తు దోషాలను, సమస్యలను పెంచుతాయట.