Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా?
Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేవారు తప్పకుండా అమ్మవారికి ఇష్టమైన కొన్ని రంగుల దుస్తులను ధరించి పూజ చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు తొందరగా లభిస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Thu - 16 October 25

Diwali: హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈ దీపావళి పండుగను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ దీపాలను వెలిగిస్తూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన మనం దీపావళి పండగ జరుపుకోనున్నారు. కాగా దీపావళి పండుగ అంటే దీపాల పండుగ. అందుకే ఈ పండుగ రోజున ఇంటిని దీపాలతో పూలతో చక్కగా అలంకరిస్తూ ఉంటారు. కొత్త దుస్తులు ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
అయితే పూజ చేయడం ఎంత ముఖ్యమో, పూజ చేసేటప్పుడు ధరించే దుస్తుల రంగులు కూడా అంతే ముఖ్యం అని చెబుతున్నారు. మరీ దీపావళి రోజున ఏ రంగు దుస్తులు ధరించాలి అన్న విషయానికి వస్తే.. పసుపు రంగు లక్ష్మీ పూజకు అత్యంత శుభకరం. ఈ రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. అలాగే ఈ గ్రహం శాంతి, ధర్మం, సంపదకు ప్రతీకగా బావిస్తారు. పసుపు రంగు ధరించడం వల్ల మన ఆత్మ సంతోషంగా ఉంటుందట. మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ రంగు దుస్తులు ధరిస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి కృప లభిస్తుందని చెబుతున్నారు.
అలాగే ఎరుపు, తెలుపు రంగులు కూడా శుభప్రదం అని చెబుతున్నారు. పసుపు అందుబాటులో లేకపోతే లేదా వేరే రంగు ప్రయత్నించాలనుకుంటే, ఎరుపు, తెలుపు రంగులు చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమ, సంపదకు చిహ్నంగా బావిస్తారు. ఇది కుజుడు, శుక్రుడు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుందట. ఆధ్యాత్మికత, ధన సంపదను కూడా సూచిస్తుందని చెబుతున్నారు. ఇక తెలుపు రంగు ధరించడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుందట. కొత్త అవకాశాలు వస్తాయని లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. కాగా నలుపు శనిగ్రహాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ప్రతికూలత, నిరాశ, మానసిక ఒత్తిడిని కలిగిస్తుందట. అలాగే గోధుమ, నీలం షేడ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్ లను తగ్గిస్తాయని నమ్మకం. ఈ రంగులు పూజ సమయంలో ధరించకపోవడమే మంచిదని చెబుతున్నారు. దీపావళి అనేది వెలుగుల పండుగ మాత్రమే కాదు, మన మనసులోని చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక సందర్భం కూడా. ఈ రోజు ధరించే శుభ రంగు దుస్తులు మన జీవితంలో కొత్త వెలుగును, శ్రేయస్సును, ఆనందాన్ని తెస్తాయని భక్తుల నమ్మకం.