Diwali 2025: సిరి సంపదలకు లోటు ఉండకూడదంటే దీపావళి రోజు తులసి దేవిని ఇలా పూజించాల్సిందే!
Diwali 2025: ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, సిరిసంపదలు కలగాలి అంటే దీపావళి పండుగ రోజు తులసి దేవిని ఇప్పుడు చెప్పినట్టుగా పూజిస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:08 PM, Wed - 15 October 25

Diwali 2025: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈరోజున ఇంటిని చక్కగా దీపాలతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. అమావాస్య రోజున ఇళ్ళు దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజుని ఈ దీపావళి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. అలాగే లక్ష్మీదేవి, గణేశుడి పూజిస్తూ ఉంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం , శాంతి లభిస్తుందని, సిరి సంపదలకు లోటు ఉందని అదృష్టం పెరుగుతుందని నమ్మకం.
అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటి సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజించడంతో పాటు తులసిని పూజించాలట. ఈ రోజున తులసి దేవిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు వస్తుందని చెబుతున్నారు. అయితే మరి దీపావళి రోజున తులసి మొక్కను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..దీపావళి నాడు తులసిని ఎలా పూజించాలంటే.. తులసి దగ్గర దీపం వెలిగించండి దీపావళి నాడు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయాలి.
ఈ పరిహారం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందట. సురక్షితమైన జీవితాన్ని అందిస్తుందని చెబుతున్నారు. దీపావళి రోజున ఉదయం స్నానం చేసి తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కకు వైవాహిక జీవితంలో ఆనందం కోసం పసుపు, కుంకుమ, గాజులు, రవిక, పెట్టి పూజ చేసి ఆవు పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలట. ఈ వస్తువులను వివాహిత స్త్రీకి వాయినంగా అందించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుందట. దీపావళి నాడు కొద్దిగా గంగా జలం కలిపిన నీటిని తులసికి సమర్పించాలట. అలాగే తులసి మంత్రాలను కూడా జపించాలని చెబుతున్నారు. దీపావళి నాడు చేసే ఈ పూజ పరిహారాల వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని, లక్ష్మి ఆశీస్సులు కూడా కలుగుతాయని చెబుతున్నారు. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలిగి సిరిసంపదలకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు.