Diwali 2024: దీపావళి రోజు లక్ష్మి పూజ ఏ సమయానికి చేయాలి? విధి విధానాలు ఇవే!
దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఆ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 31 October 24

దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ధన త్రయోదశి రోజు నుండి దాదాపుగా 5 రోజుల పాటు జరుపుకునే దీపాల పండుగ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది దీపావళి తేదీ విషయంలో ప్రజల్లో చాలా గందరగోళం నెలకొంది. అలాగే ఈ రోజున చేయాల్సిన విధివిధానాల గురించి కూడా అనేక రకాల సందేహాలు ఉన్నాయి. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం..దీపావళి పండుగ ఎప్పుడు అన్న సందేహానికి.. అక్టోబర్ 31 సాయంత్రం మాత్రమే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు పండితులు.
ధన త్రయోదశి ,నరక చతుర్దశి, దీపావళి, ఈ మూడు పండుగలలో లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజు సాయంత్రం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజించడం వలన జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు విఘ్నేశ్వరుడిని కూడా తప్పకుండా పూజించాలని చెబుతున్నారు. అలాగే కొంతమంది లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడం కూడా మంచిదే అని చెబుతున్నారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని, కుబేర దేవుడిని పూజించడం వలన డబ్బు కొరత తొలగిపోతుందట.
అలాగే కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతున్నారు. కాగా దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని, ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. లక్ష్మీమాత సమేతంగా కుబేర దేవుడిని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని ఎంతో లాభం ఉంటుందని చెబుతున్నారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవితో పాటు కుబేరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
అయితే లక్ష్మీదేవితో పాటు కుబేరుని పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, శుక్రవారం రోజు కుబేరుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు తప్పకుండా 13 దీపాలను వెలిగించాలని చెబుతున్నారు. అలాగే దీపావళి రోజు సాయంత్రం సమయంలో మాత్రమే పూజ చేయాలని చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య లక్ష్మీ పూజ నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, అనంతరం దీపాలను వెలిగించి టపాసులు పేల్చుకోవచ్చని పండితులు చెబుతున్నారు.