Things: మీకు ఈ విషయాలు తెలియదా.. అయితే వెంటనే తెలుసుకోవాల్సిందే..లేదంటే?
ఈ బిజీ బిజీ లైఫ్ లో చాలామంది అనేక విషయాలను పట్టించుకోవడం మాత్రమే కాకుండా తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి కొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 10:32 AM, Fri - 13 December 24

మనకు తెలియని చాలా విషయాలు ఆధ్యాత్మిక రహస్యాలు చాలానే దాగి ఉన్నాయి. చాలామందికి వాటి గురించి పెద్దగా తెలియదు. కేవలం కొన్ని మాత్రమే మనలో చాలామందికి తెలుసు. మరి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అదేవిధంగా జుట్టు బాగా పొడవుగా ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులు అవుతారట. ఇలా జుట్టు పొడవు ఉన్న అమ్మాయిలు వారి భర్తలకు సంపాదన తెచ్చి పెడతారని పండితులు చెబుతున్నారు.
ఆలయాలలో ఉండే నవగ్రహాలకు కనీసం నెలకు ఒక్కసారి అయినా ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు. తరచుగా వెళ్లేవారు పర్లేదు కానీ, ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్లేవారు తప్పనిసరిగా నవగ్రహాలకు నెలలో ఒకసారి అయిన ప్రదక్షిణలు చేయాలట. మంగళవారం రోజు పొరపాటున కూడా అప్పును ఇవ్వకూడదు. ఒకవేళ అలా అప్పు ఇస్తే అది మీకు తిరిగి రాదట. మీరు అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించలేరట.. ఒకవేళ అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు మంగళవారం రోజు కొంత అయినా అప్పు తీరిస్తే తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఎట్టి పరిస్థితులలో కూడా శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయకూడదట. అలాగే శనివారం రోజు ఆయిల్ వంటివి కూడా కొనుగోలు చేయకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్ళితే స్త్రీలు మొదట ముందు ఉండాలి. అశుభ కార్యానికి వెళ్తే పురుషులు ముందు ఉండాలని చెబుతున్నారు పండితులు. స్టీలు ఎప్పుడూ కూడా మధ్య వేలుతో మాత్రమే బొట్టు పెట్టుకోవాలట. ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తే దానిని ఆ శుభశకునంగా భావించాలట. ఒకవేళ కుక్క ఎదురు వస్తే అది చాలా మంచిదని వెళ్లే పని విజయవంతంగా పూర్తి అవుతుందని అర్థం అంటున్నారు పండితులు.