Shiva Temple: శివాలయంలో ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తే చాలు..ఎలాంటి కోరికలైనా నెరవేరాల్సిందే!
శివాలయానికి వెళ్ళినప్పుడు మనం కోరుకునే కోరికలు తొందరగా నెరవేరాలంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Thu - 6 February 25

మామూలుగా మనం పండుగ సమయాలలో అలాగే ప్రతిరోజు ఆలయాలకు వెళుతూ ఉంటారు. విశేషమైన రోజుల్లో కూడా ఆలయాలకు వెళుతూ ఉంటారు. ఆలయానికి వెళ్లిన తర్వాత ప్రదక్షిణలు చేయడం అన్నది తప్పనిసరి. మూడు ప్రదక్షిణల నుంచి 108 ప్రదక్షణల వరకు ఎవరి మొక్కుబడి మేరకు వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఇతర ఆలయాలలో చేసే ప్రదక్షిణల కంటే శివాలయంలో చేసే ప్రదక్షిణాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ శివాలయంలో ఎలా ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేస్తే మంచి జరుగుతుంది కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ఈ చండి ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట. అయితే ఇందుకోసం మొదట శివాలయంలో ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లాలట. చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగాలి. ఆ తరువాత మళ్లీ ప్రదక్షిణ మొదలు పెట్టి సోమ సూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లుగా భావించాలట. ఈ విధంగా చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణము అని అంటారు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుంచే బయటకు పోతుంది. అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారట.
శివాలయంలో ఈ విధంగా ఒకసారి చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షిణాల కంటే పదివేల ప్రదక్షిణలతో సమానమని చెబుతున్నారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే పొరపాటున కూడా నంది శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదే ఉంటాయి. అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు. దేవాలయంలో దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేయకూడదుట. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. ఆ దైవిక శక్తి తరంగాలను భరించే శక్తి మానవ మాత్రులకు ఉండదు. ఆ శక్తిని మనం భరించలేం. కనుక దేవాలయానికి వెళితే ఒక పక్కన నిలబడి దేవుని దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు.